Poonam Pandey Death Reactions : సెన్సేషన్స్కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ పలు మార్లు వార్తలోకెక్కింది బాలీవుడ్ నటి పూనమ్ పాండే. గతంలో ఆమె ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా ప్రతీ విషయంలో ఆమె ఎన్నో సార్లు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక 2011లో వరల్డ్‌కప్ (ODI World Cup) సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇలా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌తో ఏదో విషయంలో హాట్ టాపిగ్గా మారడం పూనమ్‌కు అలవాటైంపోయిందని ఆమెపై నెటిజన్లు ఫైరవుతున్నారు.
రీసెంట్గా శుక్రవారం (ఫిబ్రవరి 2) పూనమ్ మరణించిందని ఆమె వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో తెలిపింది. ఇక ఆమె మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు, ఆమె ఫ్యాన్స్ సంతాపం తెలిపారు. అయితే ఒకరోజు తర్వాత (శనివారం) తాను చనిపోలేదంటూ ఓ వీడియో రిలీజ్ చేసి అందర్నీ షాక్‌కు గురిచేసింది.
అయితే తాను సర్వైకల్ క్యాన్సర్‌తో మృతిచెందలేదని, ఆ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశానంటూ పూనమ్ ఓ తాజా వీడియోలో చెప్పుకొచ్చింది. 'మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్లలేదు. బతికే (ఆరోగ్యంగా) ఉన్నాను. సర్వైకర్ క్యాన్సర్ (Cervical Cancer) వల్ల మరణించలేదు. కానీ, ఆ వ్యాధి వేలాది మంది మహిళల ప్రాణాలు తీసుకొంది. ఇది ఇతర క్యాన్సర్ల లాంటిది కాదు. ఈ సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ముందుగా ఈ వ్యాధిని గుర్తించి హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. అందరికీ అవగాహన కల్పిద్దాం' అని పూనమ్ చెప్పింది.
దీంతో ఈ విషయంపై నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఇదొక చెత్త పబ్లిసిటీ స్టంట్ అని ఒకరు కామెంట్ చేయగా, మరోసారి నీ మాటలు ఎవరూ నమ్మరని మరొకరు పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. ఇక పబ్లిసిటీ ఏమోగాని ఆమె బతికే ఉన్నందుకు మరికొందరు హ్యాపీ ఫీలవుతున్నారు.
-
🚨Poonam Pandey is Alive🚨
— Neha Bisht (@neha_bisht12) February 3, 2024
Using a platform to spread awareness might be commendable, but faking your own death is a new low. Shame!#PoonamPandey #PoonamPandeyDeath pic.twitter.com/Kk8LsFW9cy
పూనమ్ పాండే మృతిలో బిగ్ ట్విస్ట్ - బతికే ఉన్నానంటూ కెమెరా ముందుకు నటి