Poonam Pandey Death : బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై విమర్శలు ఆగట్లేదు. ఆమెపై కఠి చర్యలు తీసుకోవాలని సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు! ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని అంటున్నారు. సర్వైకల్ క్యానర్ అవగాహన పేరుతో తాను మృతి చెందినట్లుగా పూనమ్ పాండే డ్రామా ఆడడం వల్ల ఈ విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా అంతా గత రెండు మూడు రోజుల నుంచి ఆమె పేరే ఎక్కువగా ట్రెండింగ్ అవుతోంది. అందరూ ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియోషన్(ఏఐసీడబ్లూఏ) కూడా పూనమ్ పాండేపై విమర్శలను గుప్పించింది. ఆమెపై ఎప్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. "తన పబ్లిసిటీ కోసం గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన అనే ముసుగును వేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయిందనే వార్త ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ ఫేక్ న్యూస్ వల్ల ఆమెకు నివాళులర్పించిన భారతీయులందరి మనోభావాలను దెబ్బతిన్నాయి. తమ స్వలాభం కోసం ఇలాంటి తప్పుడు వార్తను వ్యాప్తి చేసిన పూనమ్ పాండే, ఆమె మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలని కోరుతున్నాం. ఇలాంటి అసత్య వార్తలను ఎవ్వరూ సర్క్యులేట్ చేయకుండా ఉండాలంటే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ ఏఐసీడబ్లూఏ పేర్కొంది.
సినీ సెలబ్రిటీలు కూడా : ఇంకా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పూనమ్ పాండే డెడ్ డ్రామాపై రియాక్ట్ అయ్యారు. బిపాసా బసు, మినీ మాథుర్ సహా మరికొంతమంది పూనమ్ ఇలా చేయడం సరైంది కాదంటూ, సిగ్గుచేటు అంటూ కామెంట్లు చేశారు.
కాగా, పూనమ్ పాండేకు ఇలా చేయడం కొత్తేమి కాదు. సెన్సేషన్స్కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ పలుసార్లు వార్తలోకెక్కింది. 2011 ODI World Cup సమయంలో తొలిసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ - ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా ప్రతీ విషయంలో ఆమె ఎన్నో సార్లు చర్చనీయాంశమైంది.
పూనమ్ పాండే మృతిలో బిగ్ ట్విస్ట్ - బతికే ఉన్నానంటూ కెమెరా ముందుకు నటి