ETV Bharat / entertainment

రజనీ ఆరోగ్యంపై ప్రధాని ఆరా - 'త్వరగా ఇంటికి తిరిగి రావాలంటూ ప్రార్థించాను' - Rajini Health Update

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

PM Modi Asks Rajini Health Update : సూపర్ స్టార్ రజనీకాంత్​ హెల్త్​ అప్​డేట్ తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా రజనీ సతీమణి లతకు ఫోన్​ చేశారు. ఆయన యోగక్షేమాల గురించి తెలుసుకున్న మోదీ, రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Rajini Health Update
Rajini Health Update (ETV Bharat, ANI)

PM Modi Asks Rajini Health Update : సూపర్ స్టార్ రజనీకాంత్​ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంటూ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యోగక్షేమాల గురించి ప్రముఖులు, అభిమానులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన త్వరగా బాగవ్వాలని కోరుకుంటున్నారు. అయితే తాజాగా ప్రధాని మోదీ కూడా రజనీకాంత్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. అక్టోబర్‌ 1న రజనీ సతీమణి లతతో ఆయన ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

"మన సూపర్‌స్టార్‌ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఇటీవలె ఆరా తీశారు. రజనీ సతీమణితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు" అని తెలిపారు.

ఇదిలా ఉండగా, రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, స్టార్ హీరో కమల్‌ హాసన్‌ కూడా ట్విట్టర్​లో పోస్ట్‌లు పెట్టారు. ఇక హీరో విజయ్‌ కూడా రజనీకాంత్‌ త్వరగా ఇంటికి తిరిగి రావాలంటూ దేవుడిని ప్రార్థించానని అన్నారు.

ఇదీ జరిగింది :
అనారోగ్యం కారణంగా రజనీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన ఆస్పత్రిలో చేరగా, మంగళవారం సాయంత్రం చెన్నై గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ మెడికల్‌ బులెటిన్‌ను విడుదల చేశాయి. అందులో ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిందని, దానికి ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చినట్టు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారంటూ వైద్యులు తెలిపినట్లు ఆ బులెటిన్​లో ఉంది.

Rajinikanth Vettaiayan Movie : కాగా, ప్రస్తుతం ఆయన 'వేట్టయాన్‌', 'కూలీ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'వెేట్టయాన్‌' అక్టోబర్‌ 10న విడుదల కానుంది. రీసెంట్​గానే ఈ చిత్ర టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇందులో ఆయన పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్​గా నటిస్తున్నారు. సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి కనిపిస్తారని అంటున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి.జ్ఞాన్​వేల్ దర్శకత్వం వహించారు.

Rajinikanth Coolie Movie : ఇక 'కూలి' సినిమ విషయానికొస్తే యాక్షన్‌ థ్రిల్లర్​గా ఇది ముస్తాబవుతోంది. నాగార్జున, శ్రుతిహాసన్‌, సౌబిన్‌ షాహిర్‌ సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీ కాంత్‌కు ఇది 171వ చిత్రం. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. కూలీ సినిమాలో నెంబర్‌ 1421గా రజనీకాంత్‌ దేవా పాత్ర పోషిస్తుండగా, చేస్తుండగా సైమన్‌గా నాగార్జున కనిపించనున్నారు.

రజనీకాంత్ హెల్త్ అప్డేట్​ - స్టెంట్‌ వేసిన వైద్యులు- మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్! - Rajnikanth Health Update

ఆయన ఇల్లు వేలం - బాలీవుడ్‌ మొత్తం నవ్వుకుంది! ఇప్పుడేమో : రజనీ ఎమోషనల్ స్పీచ్ - Rajinikanth Emotional Speech

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.