PK Aamir Khan Movie : అమీర్ ఖాన్ PK సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా కంటెంట్ హిట్‌తో పాటు వసూళ్ల వర్షం కురిపించింది. గ్రహాంతర వాసిగా అమీర్ ఖాన్ నటన ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే ఈ సినిమా వల్ల ఇందులో 5 సెకన్ల పాటు నటించిన మనోజ్ రాయ్ అనే రియల్ లైఫ్ బిచ్చగాడి జీవితమే మారిపోయింది. అతడిని పెద్ద స్టార్ చేసింది.
అసలేం జరిగిందంటే? అస్సాంలోని సోనిత్ పూర్‌కు చెందిన మనోజ్ రాయ్ తల్లి అతడు పుట్టిన నాలుగు రోజులకే కన్ను మూసింది. తండ్రి రోజువారీ కూలీ పని చేస్తూ ఇంటిని పోషించేవాడు. దీంతో ప్రాథమిక విద్య సగంలోనే ఆపేసి అడుక్కోవడం ప్రారంభించాడు మనోజ్. దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కళ్లు లేని వాడినని నమ్మించి అడుక్కునేవాడు.
ఒకరోజు అలా మనోజ్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి "నువ్వు నటించగలవా?" అని అడిగారట. తాను నటనతోనే రెండు పూటలా తిండికి సంపాదించుకుంటున్నాని మనోజ్ చెప్పడంతో వాళ్లు అతనికి 20 రూపాయలతో పాటు ఒక ఫోన్ నెంబర్ కూడా చేతిలో పెట్టి వెళ్లిపోయారట. ఆ ఫోన్ నెంబర్‌కు మనోజ్ తర్వాత ఫోన్ చేస్తే నెహ్రూ స్టేడియంకు రమ్మని బదులు వచ్చిందట. దీంతో మనోజ్ తర్వాత రోజు నెహ్రూ స్టేడియంకు వెళ్ళినప్పుడు అక్కడ తనతో మరో ఏడుగురు అడుక్కునేవాళ్ళు కూడా వచ్చారట. వాళ్లతో పాటు కలిసి ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు మనోజ్.
ఆ ఆడిషన్స్‌లో మనోజ్ సెలెక్ట్ అయ్యాడు. అదే పీకే సినిమా. ఇందులో అతడు కళ్లు లేని వ్యక్తిగా బిచ్చం ఎత్తుకునే సన్నివేశంలో కనిపించాడు. అమీర్ ఖాన్ తన గ్రహం నుంచి వచ్చాక ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒక కళ్లు లేని బిచ్చగాడి చేతిలో ఉన్న పళ్లెంలో డబ్బులు తీసుకుంటాడు. ఆ బిచ్చగాడే మనోజ్. ఈ ఛాన్స్ వల్ల దిల్లీలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అతడికి ఉండే అవకాశం వచ్చింది. అనంతరం సినిమా విడుదలై మనోజ్‌ను అతని ఊర్లో పెద్ద హీరోను చేసేసింది. అతడికి ఊరు వారంతా ఘనస్వాగతం పలికారట. అతనికి ఒక షాప్‌లో ఉద్యోగంతో పాటు చక్కనైన గర్ల్ ఫ్రెండ్‌ను కూడా ఈ సినిమా ఛాన్స్ వల్లే వచ్చిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు మనోజ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టాలీవుడ్లో మరో విషాదం - ప్రముఖ రైటర్ కన్నుమూత - Sri Ramakrishna Died
మళ్లీ నయా లుక్‌లో మహేశ్ - ఈ సారి మరింత స్టైలిష్‌గా! - Mahesh Babu New Stylish look