ETV Bharat / entertainment

'ఉస్తాద్​ భగత్​సింగ్' ​ స్క్రిప్ట్​లో మార్పులు- పవన్ రిక్వెస్ట్​కు డైరెక్టర్ ఓకే! - USTAAD BHAGAT SINGH UPDATES

ఉస్తాద్​ భగత్​సింగ్ స్క్రిప్ట్​లో మార్పులు- పవన్ కల్యాణ్​ రిక్వెస్ట్​కు డైరెక్టర్ ఓకే

Pawan Kalyan Ustaad Bhagat Singh
Pawan Kalyan Ustaad Bhagat Singh (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 4:11 PM IST

Pawan Kalyan Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

స్క్రిప్ట్​లో మార్పులు!
'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' మూవీ స్క్రిప్ట్​లో దర్శకుడు హరీశ్ శంకర్ మార్పులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ అభ్యర్థన మేరకు హరీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం పవన్, హరీశ్​ను కలిశారని, ఆ సమయంలోనే స్క్రిప్ట్​లో మార్పులు చేయమని సూచించారని వార్తలు వినిపిస్తున్నాయి. డైలాగ్ వెర్షన్​ను కూడా మార్చమని పవన్ కోరారని, అందుకు తగ్గట్లు హరీశ్ స్క్రిప్ట్ రీవర్క్ చేస్తున్నారని సమాచారం. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ త్వరలోనే హైదరాబాద్​లో జరగనున్నట్లు సమాచారం. పవన్ వీలును బట్టి షూటింగ్​లో పాల్గొంటారని టాక్.

గబ్బర్ సింగ్ తర్వాత క్రేజీ
కాగా, 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో వస్తుండటం వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌ టైనర్‌గా రాబోతుందీ చిత్రం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ గతేడాదే మొదలు పెట్టారు మేకర్స్. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక పవన్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో, త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కనుంది.

కాగా, ఈ సినిమాలో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2025లో సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్​ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఊహించని సర్​ప్రైజ్​

'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది, అది కనిపించని సైన్యం'- పీక్స్​లో పవన్ 'ఉస్తాద్' గ్లింప్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.