HariHara VeeraMallu Shooting Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న సినిమాల్లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీరమల్లు కూడా ఒకటి. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదటి భాగానికి సంబంధించి చిత్రీ కరణ ముగింపు దశకు చేరుకుంది. కానీ వాస్తవానికి గత కొద్ది కాలంగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గానే మళ్లీ షూటింగ్ ప్రారంభించుకుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్న, పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌కు కాస్త సమయాన్ని కేటాయించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలిపింది. సెట్స్‌లో పవన్ కల్యాణ్ స్క్రిప్ట్ పేపర్ చదువుతున్న ఫొటోను పంచుకుంది. 2025 మార్చి 28న సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది. ఆ మధ్య కూడా 'అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది' అని పేర్కొంది.
HariHara VeeraMallu Cast and Crew : కాగా, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నోరాహి ఫతేహి, నిధి అగర్వాల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Powerstar @PawanKalyan garu gears up for the final schedule of #HHVM.💥⚔️
— Shreyas Media (@shreyasgroup) December 10, 2024
Here’s an epic BTS moment from the sets of #HariHaraVeeraMallu.🔥
See you all in theaters on 28th March 2025! 🔥🔥@AMRathnamOfl @thedeol @AnupamPKher @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani… pic.twitter.com/riBsJmKdwQ
ఈ వారం OTTలోకి ఏకంగా 35 సినిమా, సిరీస్‌లు - ఆ 5 చిత్రాలు వెరీ స్పెషల్!
'బ్లాస్ట్ ది హెలికాప్టర్!' - పవన్ కల్యాణ్ OG లేటెస్ట్ అప్డేట్ ఇదే!