ETV Bharat / entertainment

OG అప్డేట్: ఇప్పటికైతే 'సీజ్​ ది షిప్'- PK ఫ్యాన్​కు మేకర్స్ ఫన్నీ రిప్లై - PAWAN KALYAN OG

ఓజీ అప్డేట్స్​ కావాలంటూ ఫ్యాన్స్ ట్వీట్- ఫన్నీ రిప్లై ఇచ్చిన మేకర్స్!

Pawankalyan OG
Pawankalyan OG (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 12:52 PM IST

Pawan kalyan OG : పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఓజీ' (OG). ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే సినిమా నుంచి ఒక్క టీజర్ మినహా ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్​ అప్డేట్స్ కావాలంటూ సోషల్ మీడియాలో మేకర్స్​ను ట్యాగ్ చేస్తూ పోస్ట్​లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని- మేకర్స్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మరి అది ఏ పోస్ట్ అంటే?

ఓజీ అప్డేట్ కావాలంటూ ఓ అభిమాని 'ఓజీ అప్డేట్‌ ఇచ్చి చావు' అని పోస్ట్‌ పెట్టాడు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. 'అప్డేట్​లు ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్‌ ది షిప్‌' అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్​ కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్‌ అన్న 'సీజ్‌ ది షిప్‌' పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈ మాటలను కూడా ఓజీ సినిమాలో ఉపయోగించాలని డైరెక్టర్​ సుజీత్​ను ఫ్యాన్స్​ కోరుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాలోని తొలి పాట వినిపించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ సాంగ్​ను విడుదల చేస్తారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబరు 2న పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగానే ఈ ఫస్ట్ సాంగ్​ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ అప్పుడు కుదరలేదు.

కాగా, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌ కల్యాణ్ ఓజాస్‌ గంభీర అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్‌ నటిస్తున్నారు. బ్యూటీ ప్రియాంకా మోహన్‌ హీరోయిన్​గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య దీనిని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

పవన్ కల్యాణ్ X ప్రకాశ్ రాజ్ - 'OG'లో ఇద్దరి మధ్య ఫైట్​ సీన్?

పవన్‌ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'ఓజి' సర్​ప్రైజ్​ ఆ రోజే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.