Patriotic Songs In Telugu : బ్రిటిష్ దొరల పాలన నుంచి విముక్తి పొంది 78వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేజర్ చంద్రకాంత్, అల్లూరి సీతారామరాజు, ఖడ్గం, ఆర్ఆర్ఆర్ వంటి తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని దేశభక్తి గీతాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
'పుణ్యభూమి నా దేశం నమో నమామి'
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రంలో 'పుణ్యభూమి నా దేశం నమో నమామి- ధన్య భూమి నా దేశం సదా స్మరామి' అనే పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో రచయిత దేశం, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చక్కగా వివరించి శ్రోతల్లో దేశభక్తిని ఇనుమడింపజేశారు.
'తెలుగు వీర లేవరా- దీక్ష బూని సాగరా'
సూపర్ కృష్ణ హీరోగా తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు సినిమాలోని 'తెలుగు వీర లేవరా- దీక్ష బూని సాగరా' పాట ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. దేశ ఔనత్యాన్ని, ధైర్యం గురించి చెబుతూ సాగుతుందీ పాట.
'మేమే ఇండియన్స్'
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖడ్గం' సినిమాలోని మేమే ఇండియన్స్ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మతాల వేరైనా అందరం భారతీయులమనే అర్థం వచ్చేటట్లు సాగుతుంది ఈ పాట. మేమే ఇండియన్స్ అంటూ సాగే ఆ పాట స్వాతంత్ర్యం దినోత్సవం నాడు ఎక్కువగా వినిపిస్తుంటుంది.
మహాత్మలోని 'ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ', ఆర్ఆర్ఆర్ లోని 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా', బొబ్బిలి పులిలోని 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి', సింధూరంలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? వంటి పాటలు యువరక్తాన్ని ఉర్రూతలూగించాయి. ఎంతో మంది త్యాగాలను మనకు అర్ధం అయ్యేలా వివరించాయి.
జై చిత్రంలోని 'దేశం మనదే', 'శంకర్ దాదా జిందాబాద్ లోని 'ఓ బాపు నువ్వే రావాలి', 2010లో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాలో 'దేశమంటే మట్టి కాదోయ్' సైరా నరసింహారెడ్డిలోని ఓ పాట ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో దేశస్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కోసం చక్కగా వివరించారు. ఈ పాటలను వింటున్నంతసేపు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. గేయంలోని ప్రతిపదం యువతకు దేశప్రాముఖ్యతను వివరిస్తుంది.
ఇండిపెండెన్స్ డే స్పెషల్: బాలీవుడ్ దేశభక్తి చిత్రాలు- గూస్బంబ్స్ పక్కా! - Independence Day Movies