Padmavibhushan Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటేనే మనం. ఇండస్ట్రీలో అందరినీ కలుపుకొని పోయే గుణం. గత నాలుగు దశాబ్దాలుగా చిత్ర సీమను ఏలుతూనే ఉన్నారు. మనిషి జీవితంలో విజయాలు, అపజయాలు రావడం సర్వసాధారణం. అందుకే విజయం వస్తే ఉప్పొంగిపోవడం, అపజయం వస్తే కుంగిపోవడం ఆయనకు తెలీదు. అయితే కష్టపడితేనే విజయం వరిస్తుందని నమ్మిన ఆయన ఎప్పుడూ తన సినిమాతో అభిమానులను రంజింపజేయాలని తాపత్రయపడుతుంటారు.
నటుడిగా విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి - వ్యక్తిగాను 'అందరివాడు' అయ్యారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఎన్నో చారిటబుల్ ట్రాస్ట్ల ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఎంతో సాయం చేశారు. ఇంకా సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన చెప్పిన మాటలను, సూక్తులను, చేసిన పనులను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగారు. అందుకే ఆయన్ను వన్ అండ్ ఓన్లీ మెగస్టార్ అని అందరూ అంటుంటారు.
తాజాగా దీనికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశంలోని రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. 2006లో 'పద్మ భూషణ్' అందుకున్న ఆయన్ను తాజాగా 'పద్మ విభూషణ్'(Padmavibhushan Chiranjeevi) ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా వివిధ సందర్భాలలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులను ఉద్దేశించి చెప్పిన సూక్తులను ఏంటో తెలుసుకుందాం.
1. సాధనతో లక్ష్యాన్ని ఛేదించండి.
2. సమయాన్ని సద్వినియోగం చేసుకొని పట్టువదలని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి.
3. మనం బ్రతికి పదిమందిని బ్రతికించాలి. మనం ఆనందపడి పదిమందిని ఆనందపరచాలి.
4. జనం మీద బ్రతకడం కన్నా జనం కోసం బ్రతకడం అలవర్చుకోవాలి.
5. ఆకలికి తిండి అవసరం కాని తిండి కోసమే బ్రతకకూడదు.
6. ఓర్పును మించిన తపస్సులేదు. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఐశ్వర్యం లేదు.
7. మనం శాంతియుతమై ఉంటే ఇల్లు శాంతినిలయమౌతుంది.
8. దివ్యమైన జీవితాన్ని కోరుకోవాలి కాని దీర్ఘ జీవితాన్ని కాదు.
9. గొప్ప వ్యక్తిత్వం, మంచితనం, మేధస్సు, ప్రేమ, దయ ఇవియే నిజమైన ఆస్తులు.
చిరు@155- మెగాస్టార్‌కు నచ్చిన టాప్-10 మూవీస్ ఇవే
'చిరంజీవిని చూస్తే నాకు ఈర్ష్య' - మెగాస్టార్ గురించి ఎవరెవరు ఏం చెప్పారంటే?