ETV Bharat / entertainment

రెండు అక్షరాల టైటిల్​లో ఏడాది ప్రేమ కథ- రీరిలీజ్​కు ముందు గుట్టు విప్పిన డైరెక్టర్ - ఓయ్​ మూవీ టైటిల్ మీనింగ్

Oye Movie Title Meaning : ఈ ఏడాది వాలెంటైన్స్​ డేను మరింత స్వీట్​గా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో పలు క్లాసిక్ లవ్ స్టోరీస్ రీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సిద్ధార్థ్‌, షామిలీ జంటగా నటించిన 'ఓయ్‌!' కూడా ఉంది. ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారన్న విషయం గురించి డైరెక్టర్​ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ రివీల్ చేశారు. ఇంతకీ అదేంటంటే ?​

Oye Movie Title Meaning
Oye Movie Title Meaning
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 4:59 PM IST

Oye Movie Title Meaning : వాలెంటైన్స్​ డే వస్తే చాలు ఇక ప్రేమికులందరూ ఆ రోజు ఏం చేయాలంటూ పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తుంటారు. కొందరేమో రెస్టారెంట్లకు, పార్కులకు వెళ్లి టైమ్​ స్పెండ్ చేస్తే, మరికొందరేమో తమకిష్టమైన వారితో ఫీల్​ గుడ్ లవ్​ స్టోరీలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలా థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక అలాంటి వారి కోసమే ఈ సారి దాదాపు ఆరు క్లాసిక్ మూవీస్ రీరిలీజ్​కు సిద్ధంగా ఉన్నాయి. అందులో 'ఓయ్'​ సినిమా ఒకటి.

2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోనప్పటికీ ఆ తర్వాత విశేషాదరణ పొందింది. టీవీ, యూట్యూబ్‌లో, ఓటీటీలో తెగ పాపులరైంది. ఈ సినిమా సాంగ్స్​ కూడా మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్​ చేస్తున్నారంటే ఎంతో మంది దాన్ని థియేటర్లలో చూసేందుకు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్​ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్​ గురించి తాజాగా వెల్లడించారు.

సాధారణంగా ఈ మూవీ టైటిల్​ను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో హీరోయిన్ హీరోను అలా పిలుస్తున్నందున దీనికి ఆ టైటిల్​ పెట్టారని అనుకున్నారు. అయితే దీంతో పాటు ఈ టైటిల్​ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందంట. అదేంటంటే

ఓయ్‌ అనే పిలుపు చాలా కుటుంబాల్లో వినిపిస్తుంటుంది. మణిరత్నం సినిమాల్లోని హీరోయిన్లు హీరోలను ఎక్కువగా ఓయ్‌ అంటూ పిలుస్తుంటారు. దాన్ని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని ఈ స్టోరీని రాసినట్లు ఆనంద్​ పేర్కొన్నారు. ఇందులో సంధ్య (షామిలీ) హీరో ఉదయ్‌ (సిద్ధార్థ్‌)ని పేరుతో కాకుండా ఓయ్‌ అని పిలుస్తుంటుంది. టైటిల్‌ పెట్టడానికి ఇదొక అంశమే అయినప్పటికీ ఈ కథను బేస్‌ చేసుకుని సినిమాకి పేరు పెడితే బాగుండదని డైరెక్టర్ అనుకున్నారట. అయితే ఈ స్టోరీ పరంగా 'ఓయ్‌' అని ఎలా వస్తుందంటే ?

ఆ రెండు అక్షరాల్లోనే అసలు స్టోరీ
హీరోయిన్​ సంధ్య, హీరో ఉదయ్‌ల లవ్ స్టోరీ 2007 జనవరి 1న (ఉదయ్‌ బర్త్​డే) మొదలవుతుంది. ఉదయ్‌ తండ్రి సంక్రాంతి సమయంలో మరణిస్తారు. మరోవైపు, వాలంటైన్స్‌ డే, హోలీ, వినాయక చవితి, క్రిస్మస్‌ ఇలా పలు పండగలకు సంబంధించిన సీన్స్​ను ఇందులో యాడ్ చేశారు. అలా తమ లవ్​ స్టోరీని ఎంతో స్వీట్​గా మలుచుకున్న సమయంలో సంధ్య క్యాన్సర్‌తో పోరాడి 2008 జనవరి 1న కన్ను మూస్తుంది. ఇలా 2007 జనవరి 1న మొదలైన ఉదయ్ సంధ్య లవ్ స్టోరీ తర్వాతి ఏడాది ( 2008) జనవరి 1న ముగుస్తుంది. ఏడాదిపాటు సాగిన లవ్​ స్టోరీ కావడం వల్ల ఆంగ్లంలో దీనికి టైటిల్ పెట్టారట. One Year- OY! అని ఈ టైటిల్​కు మరో అర్థమని డైరెక్టర్ రివీల్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Actress Shamlee Paintings : కుంచె పట్టిన 'ఓయ్'​ హీరోయిన్​.. తన నెక్స్ట్​ టార్గెట్​ ఏంటంటే..

వాలైంటైన్స్​ డే స్పెషల్ - రీ రిలీజ్​కు రెడీగా ఉన్న లవ్​ మూవీస్ ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.