ETV Bharat / entertainment

ఇద్దరు 'మహారాజ్​'లు ఒకేసారి ఎంట్రీ - ఈ వారం ఓటీటీల్లో రిలీజవ్వనున్న సినిమాలు, సిరీస్​లు ఇవే! - June 2024 OTT MOVIES - JUNE 2024 OTT MOVIES

OTT Movies This Week : ఈ వారం థియేటర్లలో అలాగే ఓటీటీల్లో సందడి చేయనున్న టాప్ తెలుగు సినిమాలు ఏవంటే?

OTT Movies This Week
OTT Movies This Week (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 6:16 PM IST

OTT Movies This Week : అసలే వర్షా కాలం మొదలైంది. ఇప్పటికే తొలకరి జల్లులు కురుస్తూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి రిలాక్స్ మోడ్​లో సినిమాలు, సిరీస్​లు చూడాలనుకుంటున్నారా? వేడి వేడి బజ్జీలు తింటూ వెబ్​ సిరీస్​లను ఓ లుక్కేస్తారా? అయితే త్వరగా ఈ స్టోరీ చూసేయండి మరీ.

టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు లీడ్​ రోల్​లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ 'హరోంహర'. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 సమయంలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక రూపొందించారు. సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'కె.జి.యఫ్‌'తో కన్నడ నటుడు యశ్ టాలీవుడ్​లో బాగా ఫేమస్ అయిపోయారు. ఆయన పాత చిత్రాలు కూడా డబ్బింగ్ రూపొంలో తెలుగులో సందడి చేశాయి కూడా. ఈ నేపథ్యంలో మరో పాత చిత్రం ఇప్పుడు రిలీజయ్యేందుకు రెడీగా ఉంది. 'రాజధాని' అనే పేరుతో కన్నడలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో 'రాజధాని రౌడీ' అనే పేరుతో ఈ నెల 14న తెలుగులో రానుంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి తన 50 వ సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. 'మహారాజ' అనే క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాతో ఆయన ఆడియెన్స్​ను పలకరించనున్నారు. అభిరామి, అనురాగ్‌ కశ్యప్‌, మమత కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్​లో జూన్‌ 14న రిలీజయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా కనిపించి అభిమానులను ఆకట్టుకున్న తెలుగు నటి చాందినీ చౌదరి ఇప్పుడు సూపర్ కాప్​ రోల్​లో అలరించనుంది. కేజియఫ్​ ఫేమ్​ వశిష్ఠ సింహా, భరత్‌రాజ్, అషురెడ్డి లాంటి స్టార్స్ నటిస్తున్న 'యేవమ్‌' అనే మూవీలో ఆమె కీ రోల్​ ప్లే చేయనుంది. ట్రైలర్​తో అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాను ఇరవయ్యేళ్ల వయసులో ఉన్నప్పుడు కన్న కలలు, లక్ష్యాల కోసం ఓ యాభయ్యేళ్ల వ్యక్తి చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఆయన ఆ కలను నెరవేర్చుకున్నాడా లేదా? అనే అంశాలతో రూపొందిందే 'మ్యూజిక్ షాప్ మూర్తి' అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి లీడ్​ రోల్స్​లో రానున్న ఈ చిత్రం జూన్‌ 14న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవి కాకుండా ఓటీటీల్లో విడుదలకు సిద్ధమైన సినిమాలు, సిరీస్​లు ఏవంటే?

అమెజాన్‌ ప్రైమ్‌
ది బాయ్స్‌ 4 (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 13

యాపిల్‌ టీవీ ప్లస్‌
ప్రిజ్యూమ్‌డ్ ఇన్నోసెంట్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 12

నెట్‌ఫ్లిక్స్‌
మిస్టరీస్‌ ఆఫ్‌ ది టెర్రకోట వారియర్స్‌ (హలీవుడ్‌ మూవీ) - జూన్‌ 12

మహరాజ్‌ (హిందీ మూవీ) - జూన్‌ 14

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి - జూన్‌ 14

బ్రిడ్జ్‌టన్‌ (వెబ్‌ సిరీస్‌) - జూన్‌ 13

జీ5
పరువు (తెలుగు)- జూన్‌ 14

లవ్‌ కీ అరెంజ్‌ మ్యారేజ్‌ - (హిందీ) జూన్‌ 14

బుక్‌ మై షో
ది ఫాల్‌ గై (హాలీవుడ్‌) జూన్‌ 14

డిస్నీ+హాట్‌స్టార్‌
ప్రొటెక్టింగ్‌ ప్యారడైజ్‌ (డాక్యుమెంటరీ) జూన్‌ 10

నాట్‌ డెడ్‌ యెట్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 12

జియో సినిమా
గాంత్‌ (హిందీ) జూన్‌ 11

ఆహా
పారిజాత పర్వం (తెలుగు) జూన్‌ 12

రిలాక్స్ మోడ్​లోకి వెళ్లాలా? ఈ సినిమాలు చూస్తే మీ ఒత్తిడంతా ఉఫ్​! - Stress Buster Movies

నెట్​ఫ్లిక్స్​లో అదరగొట్టిన ఇండియన్ సినిమాలు- టాప్​ మూవీస్​ ఇవే! - Netflix Viewership Report 2023

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.