Operation Valentine Varun Tej Marriage : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన కథలతో కెరీర్లో ముందుకెళ్తున్నారు. కంచె, అంతరిక్షం సహా ఆయన నటించిన పలు చిత్రాలే ఇందుకు ఉదాహరణ. అలా ఈ సారి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేశారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఒకేసారి మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటం వల్ల తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ఈ సినిమా కోసం తన పెళ్లి ముహూర్తాన్ని కూడా మార్చుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. చిత్రీకరణ ఎలా సాగింది, రియల్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు తమకు ఎలా సహకరించారు వింటి విషయాలను చెప్పారు.
అలా స్ఫూర్తి పొందాను : "మేము చాలా మంది ఎయిర్‌ఫోర్స్ అధికారులను కలిశాము. రియల్ ఎయిర్ బేస్‌కు వెళ్లి షూటింగ్ చేశాము. షూటింగ్లో ఖాళీ దొరికినప్పుడల్లో అక్కడ ఉండే అధికారులతో కలిసి ముచ్చటించేవాడిని. తెలుగువాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. నేను వారిని అక్కడ కలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. వాళ్లు చెప్పే కథలు, ఆపరేషన్ల గురించి వింటూ స్ఫూర్తిని పొందాను. వాళ్లు చెప్పిన ప్రతీది షూటింగ్లో బాగా ఉపయోగపడ్డాయి. ఫైటర్ జెట్‌లో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా తిరగాలి అనే విషయాలు మనకు తెలీదు. టాప్‌గన్ లాంటి సినిమాలు చూసినప్పుడు కొన్ని అర్థం అవుతాయి. ప్రాక్టికల్‌గా షూటింగ్ టైమ్‌లోనే తెలుసుకున్నాను. పైలట్‌ను మొదట ఓ స్టిములేటర్‌లో కూర్చోబెట్టి అవగాహన కల్పిస్తారు. అందులో కూర్చుంటే నిజంగానే ఫ్లైట్ నడుపుతున్నట్టు ఉంటుంది. అందులో నేను కూడా కూర్చున్నాను" అని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పెళ్లి ముహూర్తాన్ని మార్చుకున్నాను : "అసలు నా పాత్ర కోసం నేను సన్నద్ధం అవ్వడం ఒక ఎత్తైతే, ఈ సినిమా షూటింగ్ సాగిన విధానం మరో ఎత్తు అనే చెప్పాలి. ఎయిర్‌బేస్‌లో చాలా కఠిన నియమాలు ఉంటాయి. ఫోన్లు, ఫోటోగ్రఫీకి పర్మిషన్ ఉండదు. వాళ్లు చెప్పినట్టు ఉదయం 8లోపు ప్రతి నటుడు వచ్చేయాలి. మళ్లీ సాయంత్రం అందరూ ఒకేసారి తిరిగి వెళ్లాలి. ఫ్లైట్స్‌లో మనం లోపల కూర్చుంటే అంతగా శబ్ధం వినపడదు. కానీ బయట మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. మామూలు విమానాలతో పోలిస్తే ఫైటర్ జెట్‌ల శబ్ధం 20 శాతం దాదాపు ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజూ 40 లాండింగ్స్ జరిగేవి. జెట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే, సెట్‌లో ఒకరిమాటలు మరొకరికి వినపడవు. అలా 40 రోజుల పాటు షూటింగ్ చేశాం. ఒకనొక దశలో మేమూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళంలో ఓ భాగం అన్నట్టుగా ఫీల్ అయ్యాం. ఫోన్లు లేకుండా షూటింగ్లో పాల్గొనడం చాలా బాగుంది. పనిపైనే ఎక్కువ ధ్యాస పెడుతూ షూటింగ్‌ను ఎంజాయ్ చేశాం. అసలీ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్నీ మార్చుకున్నాను. సినిమా పూర్తయ్యాకే పెళ్లి చేసుకున్నాను" అని వరుణ్ చెప్పుకొచ్చారు.
ఆపరేషన్ వాలెంటైన్ - చిరుతో కలిసి వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమా తెలుసా?