NTR Koratala Siva Movie Overseas Rights : టాలీవుడ్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'దేవర' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వనుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వచ్చినప్పటికీ వాటిని కొట్టిపారేసింది మూవీటీమ్. అనుకున్న తేదీకే రానున్నట్లు ఆ మధ్య క్లారిటీ కూడా ఇచ్చింది.
Devara Movie Bussiness : అయితే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో దేవర మూవీటీమ్ బిజినెస్ కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు క్లోజ్ చేసిందత. అలాగే థియేట్రికల్ రైట్స్ కూడా ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తోందని తెలిసింది. తాజాగా ఓవర్సీస్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలిసింది. ఈ హక్కులను బడా సంస్థ హంసిని ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుందని కథనాలు వస్తున్నాయి. ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలకు అంటే యూఎస్ కరెన్సీలో 3.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారని ఫిలిం నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే 6.5 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేయాలి. అంటే రూ. 54 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కాగా, ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ హీరోయిన్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరు ఈ సినిమా ద్వారానే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్(Devara Shooting) చివరి దశకు చేరుకుంటోందని తెలుస్తోంది. దాదాపు 80 శాతం వరకు పూర్తైందని అంటున్నారు.
OTTని షేక్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ మూవీస్!
NBK 109 బ్లాస్ట్ అప్డేట్ - బాలయ్యకు విలన్‌గా 'యానిమల్' స్టార్