ETV Bharat / entertainment

'దేవర'లో ఎన్​టీఆర్ ట్రిపుల్ రోల్ కన్ఫార్మ్- ప్రూఫ్ ఇదే! - Devara Posters

NTR Devara Triple Role: స్టార్ హీరో జూనియర్ ఎన్​టీఆర్ 'దేవర' సినిమాలో ట్రిపుల్ రోల్​లో కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్​గా మారింది. దానికి ఓ ప్రూఫ్ కూడా ఉంది. మరి అదేంటంటే?

NTR Devara Triple Role
NTR Devara Triple Role
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 10:40 PM IST

NTR Devara Triple Role: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్​టీఆర్ కొత్త సినిమా 'దేవర' గురించి చిన్న విషయమైనా పెద్ద సెన్సేషనల్ అవుతోంది. పాన్ఇండియా రేంజ్​లో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్​టీఆర్ డ్యుయల్ రోల్​లో నటిస్తున్నాట్లు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో వార్త నెట్టింట వైరల్​గా మారింది.

తారక్ ఈ సినిమాలో డ్యుయల్ కాదంట, త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. కథ డిమాండ్ మేరకు ఎన్​టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. అయితే గ్సింప్స్​ రిలీజ్ అయ్యాక దేవరలో ఎన్​టీఆర్ తండ్రీ- కుమారుడి పాత్రలో (డ్యయల్) నటిస్తున్నారని టాక్ వినిపించింది. రీసెంట్​గా రిలీజ్ డేట్ పోస్టర్ వచ్చేసరికి సినిమాలో ఎన్​టీఆర్​ది ట్రిపుల్ రోల్ అని అంటున్నారు.

ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లలో లుంగీలో ఉన్నది తండ్రి పాత్ర అని, జీన్స్​ లుక్​తో పడవలో ఉన్నది కుమారుడి రోల్ అని అనుకున్నారు. తాజా పోస్టర్ ఆ రెండు లుక్స్ కంటే డిఫరెంట్​గా ఉంది. దీంతో ఈ సినిమాలో మూడు పాత్రలు ఉండవచ్చని నెటిజన్లు ఫిక్స్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్​ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ లేదు. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే డబుల్, ట్రిపుల్ రోల్స్​లో నటించడం ఎన్​టీఆర్​కు కొత్తేమీ కాదు. ఆయన ఇదివరకు చాలా సినిమాల్లో సక్సెస్​ఫుల్​గా నటించారు. ఇక 'జై లవకుశ' సినిమాలో త్రిపాత్రాభినయంలో అదరగొట్టేశారు.

ఇక ఈ సినిమాను కోస్టల్​ బ్రాక్​డ్రాప్​లో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో అందాల తార దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా నటిస్తున్నారు. సీనియర్ నటులు శ్రీకాంత్, ప్రకాశ్​రాజ్, మురళీ శర్మ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎన్​టీఆర్ ఆర్ట్స్ బ్యానర్​పై రూపొందుతోంది. దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న దేవర వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రభాస్ కల్కిలో ఎన్టీఆర్​ - అసలు విషయం చెప్పేసిన మూవీ రైటర్!

దసరా బరిలో చైతూ - దేవరతో తండేల్​ బాక్సాఫీస్ ఫైట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.