ETV Bharat / entertainment

'దేవర' పాన్ ఇండియా ప్రమోషన్స్ ​- సందీప్ వంగాతో, కపిల్​ శర్మతో తారక్ నవ్వులే నవ్వులు! - NTR Devara Promotions

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 2:23 PM IST

Devara Movie Promotions : 'దేవర' ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్​లో కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా ఆడియెన్స్​కు రీచ్ అయ్యేందుకు మూవీ టీమ్​ గట్టిగానే, ప్లాన్​గా ప్రమోషన్స్​ చేసుకుంటూ పోతోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

NTR Sandeep Vanga
NTR Sandeep Vanga (source ETV Bharat)

Devara Movie Promotions : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' చిత్రం రిలీజ్​ డేట్ దగ్గర పడుతోంది. దీంతో మూవీ టీమ్​ కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్​లో పాల్గొంటోంది. జనతా గ్యారేజ్​ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవ్వడం, జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం, విలన్​గా సైఫ్ అలీఖాన్ నటించడం, సినిమాలో యాక్షన్, వీఎఫ్​ఎక్స్​కు పెద్ద పీట వేయడం సహా పలు విషయాలు సినిమాపై భారీగా హైప్ పెంచేశాయి.

మొత్తంగా సినిమాను పాన్ ఇండియా ఆడియెన్స్​కు రీచ్ అయ్యేలా దేవర టీమ్​ గట్టిగానే ప్లాన్​గా ప్రమోషన్స్​ చేస్తోంది. ఇందులో భాగంగానే ముంబయిలో గ్రాండ్​గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేశారు. తెలుగులోనూ సెప్టెంబర్ 21 లేదా 22న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఇంకా చెన్నైలో ఓ ఈవెంట్, బెంగళూరులో మరో ఈవెంట్, చివరిగా కొచ్చిలో ఇంకో ఈవెంట్​ను ప్లాన్ చేశారట.

Devara Team Sandeep Vanga : మరోవైపు వరుస ఇంటర్వ్యూలో కూడా ఇస్తోంది దేవర టీమ్. ఇందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్​తో తారక్​ చిట్​ చాట్​ కూడా నిర్వహించారు. ఇక తాజాగా 'యానిమల్‌' దర్శకుడు సందీప్‌ వంగాతోనూ చిట్‌చాట్‌ నిర్వహించింది దేవర టీమ్​. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో 35 రోజుల పాటు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు తారక్​ మరోసారి చెప్పగా, 'దేవర' టీమ్​కు సంబంధించిన ప్రతి ఒక్కరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ కపూర్ చెప్పింది.

Devara Kapil Sharma Show : ఇంకా 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లోనూ 'దేవర' టీమ్​ సందడి చేసింది. ఇందులో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ తెగ నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. కాగా, భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది 'దేవర'. చూడాలి మరి ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకుంటుందో లేదో.

ఓటీటీలోనూ కలెక్షన్స్​ లెక్కలు - కొత్త ట్రెండ్ షురూ చేసిన ఈటీవీ విన్ - Committee Kurrollu OTT Collections

'మత్తు వదలరా 2' సాలిడ్​ ఓపెనింగ్స్!​ - ఫస్ట్​ డే ఎంత వసూలు చేసిందంటే? - Mathuvadalara 2 Collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.