NTR Devara New Look: యంగ్ టైగర్ ఎన్టీఆర్- బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా 'దేవర' సెట్స్ నుంచి ఓ ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో హీరో తారక్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నారు. ఆయనతోపాటు ఫొటోలో దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.
మెరూన్ కలర్ లైనింగ్స్ షర్ట్, లుంగీ ధరించి, భుజంపై కండూవా రింగు రింగుల జుట్టుతో ఉన్న ఎన్టీఆర్ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరలవుతోంది. ఇదిలా ఉండగా షూటింగ్‌కు సంబంధించి ఓ వీడియో లీకైంది. ప్రస్తుతం ఈ లీకైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్, దర్శకుడి సూచనలను అనుసరిస్తూ సముద్ర తీరంలో నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ తాజా వీడియో చూస్తుంటే దేవరపై కీలక సన్నివేశాలను గోవాలోనే చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఇదే షెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నారని సమాచారం. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్- సైఫ్ అలీ ఖాన్ మధ్య కీలకమైన సన్నివేశాలతోపాటు ఓ పాట కూడా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా రీసెంట్గా షూటింగ్లో చేరినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో రానున్న రెండో సినిమా ఇది. వీరి కాంబోలో ఇదివరకు వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయం అందుకుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న 'దేవర'పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ తొలుత ప్రకటించినప్పటికీ పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈటీవల సినిమా కొత్త డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. 2024 అక్టోబర్ 10న దేవర ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేవర కోసం గోవాకు తారక్- సైఫ్‌తో యాక్షన్ సీన్స్ కోసమేనట!
జాన్వీ ఆ విషయంలో అస్సలు కంట్రోల్ చేసుకోలేదట - ఈ సీక్రెట్ మీకు తెలుసా?