ETV Bharat / entertainment

'దేవర' బిజినెస్ లెక్కలు ఇవే! - ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా? - NTR Devara Movie - NTR DEVARA MOVIE

NTR Devara Movie : అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దేవర' సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రం కోసం మూవీటీమ్​ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియా అంతా నాన్​స్టాప్​గా దేవర తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్​ లెక్కలు, టికెట్​ ప్రీ సేల్స్​, ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఎప్పుడు? ఎక్కడా? చీఫ్ గెస్ట్ ఎవరు? సహా పలు వివరాలను తెలుసుకుందాం.

source ETV Bharat
NTR Devara Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 10:59 AM IST

NTR Devara Movie : 'దేవర' రాకకు మరో వారం రోజులే సమయం మిగిలి ఉంది. దీంతో సోషల్ మీడియాతో పాటు బయట సినీ ప్రియుల్లో టాక్ అంతా ఈ సినిమా గురించే. అందుకు తగ్గట్టే మూవీటీమ్​ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తోంది. తారక్ కూడా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. ఇప్పటికే ముంబయి ఈవెంట్లను పూర్తి చేసిన ఎన్టీఆర్ రీసెంట్​గానే చెన్నై ఈవెంట్లను కంప్లీట్ చేశారు. అక్కడి స్టార్ హీరోలు, దర్శకులపై ప్రశంసలు కురిపిస్తూ అక్కడి ఆడియెన్స్​కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

చీఫ్​ గెస్ట్​గా ఎవరో? - ఇక తెలుగులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించనున్నారు. హైదరాబాద్​లోనే ఈ నెల 22న దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే రెండు మూడు వేదికల పేర్లు వినిపిస్తున్నాయి కానీ, ఎక్కడ నిర్వహించనున్నారో మూవీటీమ్ ఇంకా పక్కాగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఈవెంట్​కు చీఫ్​ గెస్ట్​గా రాజమౌళి, త్రివిక్రమ్​, ప్రశాంత్ నీల్ వస్తారని టాక్ వినిపిస్తోంది. అలానే సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్​ లెక్కలు(Devara PreRelease Business) - నైజాం ఏరియాలో 'దేవర' రూ.45 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం అందుతోంది. గతంలో ఎన్టీఆర్‌ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లను అందుకున్నాయి. కాబట్టి ఈ సారి నైజాంలో రూ.50 కోట్ల షేర్ వస్తుందని అనుకుంటున్నారట. సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. పైగా సీడెడ్ నందమూరి ఫ్యాన్స్‌కు అడ్డ! కాబట్టి ఇక్కడ రూ.25 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వైజాగ్​లో రూ.12.5 కోట్లు,ఈస్ట్ రూ.8 కోట్లు, వెస్ట్ రూ.6 కోట్లు, కృష్ణా రూ. 7 కోట్లు, గుంటూరు రూ. 8.5 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లు అని టాక్ నడుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. కర్ణాటకలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ రూ.15 కోట్లకు అమ్ముడుపోయిందట. తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లు అని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్‌ అవుతుంది.

ట్రెండింగ్​లో​ కోలీవుడ్​పై ఎన్టీఆర్​ కామెంట్స్(NTR on Kollywood)​ - ప్రమోషన్స్​లో భాగంగా చెన్నై వెళ్లిన ఆయన అక్కడి దర్శకులు వెట్రిమారన్, అట్లీపై ప్రశంసలు కురిపించారు. వెట్రీమారన్ తన ఫేవరెట్ దర్శకుడని, అట్లీతో భవిష్యత్​లో ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. అలానే విజయ్ దళపతి అద్భుతంగా డ్యాన్స్​ వేస్తారని కూడా తారక్ అన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ అన్నీ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు దేవర సాంగ్స్ కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.

అక్కడ తొలి చిత్రంగా ఘనత - యూకేలో డాల్బీ అట్మాస్‌లో ప్రదర్శించనున్న తొలి తెలుగు చిత్రంగా 'దేవర' నిలవనుంది. ఈనెల 26న ప్రీమియర్స్‌ వేయనున్నారు. లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక బియాండ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా osbj నిలవనుంది.

ప్రీ సేల్స్(Devara Ticket presales)​ - దేవర టికెట్ల ప్రీ సేల్స్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయట. ముఖ్యంగా నార్త్ అమెరికాలో భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ 1.75 మిలియన్ డాలర్ల(సెప్టెంబర్ 17 నాటికి) మార్క్​ను కూడా టచ్​ చేసేసింది.

'దేవర' అనే టైటిల్ అందుకే పెట్టాం : ఎన్టీఆర్​ - NTR Comments on Devara Title

'దేవర కథ ఇదేనా? కొరటాల తన స్క్రీన్​ప్లేతో ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకోవడం ఖాయమేనా' - paruchuri gopalakrishna talk devara

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.