ETV Bharat / entertainment

నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ - కొత్త సినిమా నుంచి క్రేజీ వీడియో రిలీజ్ - NTR 101 Birth Anniversary - NTR 101 BIRTH ANNIVERSARY

NKR 21 Fist Of Flame Video : నందమూరి ఫ్యాన్స్​క సర్​ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. Fist Of Flame పేరిట ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తిగా సాగుతూ సినిమాపై హైప్ పెంచింది. Source ETV Bharat

Source ETV Bharat
NTR Kalyan ram (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 10:28 AM IST

Updated : May 28, 2024, 10:43 AM IST

NKR 21 Fist Of Flame Video : నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. అలా ఆ మధ్య బింబిసార, డెవిల్ చిత్రాలతో తన కెరీర్​లోనే భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది దసరా సమయంలో తన 21వ సినిమా కూడా అనౌన్స్ చేశారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్​పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపారు.

చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా విజయశాంతి ఓ ముఖ్య పాత్ర చేస్తోందని తెలిపారు. అయితే తాజాగా నేడు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్థంతి సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్​. Fist Of Flame పేరిట మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. షూటింగ్​ శరవేగంగా జరుగుతుందని తెలిపారు. కళ్యాణ్ రామ్​ చిత్రంలో చాలా పవర్ ఫుల్​గా కనిపించబోతున్నారని ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. మొదట క్లీన్​గా ఉన్న కళ్యాణ్ రామ్​ చేయి ఆ తర్వాత పిడికిలిగా మారి రక్తంతో తడవడాన్ని హైలైట్ చేశారు. విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తంగా ఈ NKR21 Fist Of Flame వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది. చిత్రంపై హైప్​ను కాస్త పెంచింది.

దీంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను సోషల్​ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ పంచ్ కొడతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత సీనియర్ నటి విజయశాంతి నటిస్తున్న సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో.

ఈ రికార్డ్​ ఎన్టీఆర్‌కే సాధ్యం? - అంతమంది దర్శకులతో పనిచేశారా? - NTR 101 Birth Anniversary

ఆ వ్యాధితో బాధ‌ప‌డుతున్న 'పుష్ప' విలన్ - అందుకే అలా అయిపోయారట! - Fahadh Faasil

Last Updated : May 28, 2024, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.