ETV Bharat / entertainment

నితిన్ నయా లుక్​ -​ దేశాన్ని దోచుకునే మోడ్రన్​ 'రాబిన్​హుడ్' ! - Nithiin Robinhood Movie

Nthiin Latest Movie Title Reveal : స్టార్ హీరో నితిన్​, డైరెక్టర్​ వెంకీ కుడుముల కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మువీ 'రాబిన్​హుడ్​'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. ఆ విశేషాలు మీ కోసం.

Nthiin Latest Movie Title Reveal
Nthiin Latest Movie Title Reveal
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 12:24 PM IST

Updated : Jan 26, 2024, 1:20 PM IST

Nthiin Latest Movie Title Reveal : ఇటీవలే ఎక్స్​ట్రాడనరీ మ్యాన్​గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నితిన్ ఇప్పుడు మరో థ్రిల్లింగ్​ ప్రాజెక్ట్​తో తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. 'భీష్మ' ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్​లో తెరకెక్కుతున్న 'రాబిన్​హుడ్'​ అనే మూవీలో ఆయన నటించనున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్​ను మేకర్స్​ తాజాగా విడుదల చేశారు. యాక్షన్​ థ్రిల్లర్​గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు గ్లింప్స్​ ద్వారా తెలుస్తోంది. ఇందులో శాంతా క్లాజ్ లుక్​తో నితిన్​ కనిపించి ఆకట్టుకున్నారు. తనని తాను పరిచయం చేసుకున్న విధానం కూడా ఆడియెన్స్​ను ఆకర్షిస్తోంది.

" డబ్బు చాలా చెడ్డది. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే, అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటాది. అన్నట్టే చేసింది. దేశం అంతా నా కుటుంబం. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు. ఆభరణాలేసుకున్నోళ్లంతా నా వారు. అయినా కూడ చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారూ. అయినా నేను హర్ట్ అవ్వలేదు. అందుకే అయిన వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నా హక్కు. నా ప్రాథమిక హక్కు. ఎందుకంటే భారతదేశం నా దేశం. భారతీయులందరూ నా సోదరులు, సోదరీమణులు అంటూ ఓ ఇంట్రెస్టింగ్ డైలాగ్​తో నితి పరిచయం చేసుకున్నారు. ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే నితిన్ ఇందులో భారీ లెవెల్లో దొంగతనాలు చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో నితిన్​కు జోడీగా ఎవరు రానున్నారన్న విషయం కూడా అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. ఇందులో తొలుత హీరోయిన్​గా రష్మిక మందన్నను ఎంచుకున్నారు. #VNR Trio అంటూ అప్పట్లో దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్​ చేశారు. అయితే ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుంది. అయితే రష్మిక ప్లేస్​లో ఆ తర్వాత తర్వాత శ్రీలీల పేరు వినిపించినప్పటికీ ఇంకా ఈ విషయంపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు. ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

షూటింగ్​లో హీరో నితిన్​కు గాయాలు - డాక్టర్లు ఏం చెప్పారంటే?

నితిన్​కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ - ఫ్యాన్​ బాయ్ మూమెంట్​ అంటే ఇదేనేమో!

Last Updated : Jan 26, 2024, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.