Nitesh Tiwari Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామాయణ్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇందులో నటించనున్న స్టార్స్ నుంచి ఈ సినిమా బడ్జెట్ వరకు అన్ని ఈ సినిమా భారీ అంచనాలు పెంచుతున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నట్లు తెలియగానే ఫ్యాన్స్ మరింత ఎగ్జైటెడ్‌గా ఫీలయ్యారు. అయితే ఈ సినిమా గురించి మేకర్స్ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. అంతే కాకుండా ఇందులో నటిస్తున్న వారి గురించి కూడా రోజుకో వార్త వస్తుండటం వల్ల సినీ లవర్స్ అందరూ మేకర్స్ త్వరగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే బాగున్ను అని ఫీల్ అవుతున్నాయి.
తాజాగా ఇదే విషయం గురించి చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు ఓ తాజా అప్డేట్ను ట్రెండ్ చేస్తున్నారు. దాని ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ శ్రీ రామ నవమి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే 'రామాయణ్' సినిమా నటీనటులు ఈ సినిమా టెక్నికల్ అప్డేట్స్ ఇలా పలు అంశాల గురించి మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
Nitesh Tiwari Ramayan Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే - నితీశ్ తివారీ గత కొంతకాలంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఎవరెవరు ఏయే పాత్రల్లో కనిపించనున్నారన్న విషయం గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇందులో ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రోల్స్ ఫిక్స్ అయిపోయాయని సమాచారం. ఈ ఇద్దరూ సీతారాములుగా కనిపించనున్నారట. ఇక వీరితో పాటు ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ దేవోల్ కనిపించనున్నారట. మరోవైపు కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారని టాక్ నడుస్తోంది. ఇక శూర్పణఖ రోల్‌కి బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ను లుక్ టెస్ట్ చేశారట.
Ranbir Kapoor Ramayan Movie : రాముడి పాత్ర కోసం ఆ అలవాట్లను మార్చుకున్న రణ్‌బీర్.. ఏం చేశారంటే?
Ramayan 2023 Cast : హిందీ రామాయణంలో సాయి పల్లవి ? సీత క్యారెక్టర్లో మెప్పించనున్నారా?