ETV Bharat / entertainment

'ఆర్​డీఎక్స్'​ హీరోకు జోడీగా మెగా డాటర్​ - నిహారిక కొణిదెల అప్​కమింగ్ మూవీస్

Niharika Konidela Latest Movie : వాట్​ ద ఫిష్​ సినిమాతో మెగా డాటర్ నిహారిక మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే దీంతో పాటు ఈ స్టార్ మరో ప్రాజెక్టుకు సైన్ చేసిందట. ఆ విశేషాలు మీ కోసం.

Niharika Konidela Latest Movie
Niharika Konidela Latest Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 8:01 AM IST

Updated : Feb 2, 2024, 10:08 AM IST

Niharika Konidela Latest Movie : 'ఒక మనసు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్​ నిహారిక. ఇందుంలో నాగశౌర్య సరసన కనిపించిన నిహా, తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత టాలీవుడ్​లో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్​ టాక్​ అందుకోలేదు. దీంతో మూవీస్​కు దూరమైన నిహా, ఆ తర్వాత 'పింక్​ ఎలిఫాంట్​' అనే నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా పలు వెబ్​ కంటెంట్​ను తెరకిక్కిస్తోంది. అలా ఆమె నిర్మించిన 'డెడ్ పిక్సెల్' అనే వెబ్ సిరీస్​తో ఓటీటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు తన సినీ రీఎంట్రీ పై క్లారిటీ ఇవ్వని మెగా డాటర్​, తాజాగా ఇప్పుడు వెండితెరపై మరోసారి హీరోయిన్​గా కనిపించనుంది. ఇప్పటికే మంచు మనోజ్​తో 'వాట్ ద ఫిష్' అనే సినిమాలో కీ రోల్​ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టుపై సైన్​ చేసింది మెగా డాటర్​. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగ ఆ మూవీ టీమ్​ షేర్ చేసింది. అయితే ఆ పోస్టర్​ను చూస్తుంటే ఆమె మరోసారి కోలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 'ఆర్​డీఎక్స్​' ఫేమ్​ మాలీవుడ్​ నటుడు షేన్‌ నిగమ్‌కు జంటగా కనిపించనుంది. 'మద్రాస్‌కారన్‌' అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది షేన్​ నిగమ్​ తమిళ డెబ్యూ సినిమా కావడం విశేషం.

Niharika Movies List : కెరీర్​ ప్రారంభంలో ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్​ షో 'ఢీ జూనియర్స్​'లో యాంకర్​గా వ్యవహరించి సత్తా చాటుకుంది. ఆ తర్వాత పలు వెబ్​సిరీస్​ల్లోనూ మెరిసింది. నటనపై ఉన్న ఇష్టంతో ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించింది. ఒక మనసు' 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' లాంటి సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ బాక్సాఫీస్​ వద్ద నిరాశే మిగిల్చాయి. ఇటు హీరోయిన్​గా చేస్తూనే, నిర్మాతగా మారింది నిహారిక.

పవన్ సాంగ్​కు నిహారిక, లావణ్య త్రిపాఠి - డ్యాన్స్ అదిరింది!

న్యూ లైఫ్​ స్టార్ట్​ చేసిన నిహారిక కొణిదెల!

Last Updated : Feb 2, 2024, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.