ETV Bharat / entertainment

మెగా డాటర్​పై సెలబ్రిటీల ప్రశంసల జల్లు - 'ఈ విజయానికి నువ్వు అర్హురాలివి' - NiharikaKonidela Committee Kurrollu - NIHARIKAKONIDELA COMMITTEE KURROLLU

Niharika Committee Kurrollu : మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన తాజా మూవీ 'కమిటీ కుర్రోళ్లు'పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరేమన్నారంటే?

NIHARIKAKONIDELA COMMITTEE KURROLLU
NIHARIKA KONIDELA (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 5:24 PM IST

Niharika Committee Kurrollu : చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం సొంతం చేసుకున్న తాజా చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'పై తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దిగ్గజ డైరెక్టర్లు రాజమౌళి, నాగ్ అశ్విన్, సుకుమార్, క్రిష్ లతోపాటు స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్, నాని, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్​లు ప్రత్యేకంగా అభినందించారు. అందరు కొత్త వాళ్లతో తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదువంశీలను అభినందిస్తూ సామాజిక మాద్యమాల్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేటితరం కుర్రాళ్లు సాధించిన పెద్ద విజయమంటూ రాజమౌళి కితాబు ఇవ్వగా, 'కమిటీ కుర్రోళ్లు' విజయం సాధించారనే మాట వినడం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని సుకుమార్ తెలిపారు. ప్రతిభావంతులైన యువతీ యవకులు కమిటీ కుర్రోళ్లతో తామేంటో నిరూపించుకున్నారని నాగ్ అశ్విన్ అభినందించారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఇటు చిత్ర ప్రముఖుల నుంచి అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉండగా, నిహారిక అన్నయ్య హీరో రామ్​ చరణ్​ కూడా ఈ సినిమా టీమ్​కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయాన్నికి తన సోదరి నిహారికతో పాటు టీమ్ మొత్తం అర్హులని ఆయన పేర్కొన్నారు.

"నిహారిక ఇంతటి సక్సెస్​ను సాధించినందుకు కంగ్రాజ్యులేషన్స్. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. నీ టీమ్‌తో కలిసి నువ్వు పడిన కష్టం, నీ హార్డ్​ వర్క్, అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకం. 'కమిటీ కుర్రోళ్లు'లో భాగమైన అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ కథకు జీవం పోసిన డైరెక్టర్ యదువంశీకి ప్రత్యేక అభినందనలు" అని రామ్​చరణ్​ పేర్కొన్నారు.

స్టోరీ ఏంటంటే :
గోదావ‌రి జిల్లాల్లోని ఓ మారుమూల ప‌ల్లె పురుషోత్తంప‌ల్లి. అక్క‌డ 12 ఏళ్లకు ఓ సారి జ‌రిగే భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌ర‌కు, దానిలో భాగంగా చేసే బ‌లి చేట ఉత్స‌వానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే ఈసారి జాత‌ర జ‌రిగిన ప‌దిరోజుల‌కు ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గాల్సి ఉంటుంది. అందులో ఆ ఊరి ప్ర‌స్తుత స‌ర్పంచ్ బుజ్జి (సాయికుమార్‌)పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్ల‌లో ఒక‌డైన శివ (సందీప్ స‌రోజ్) ముందుకొస్తాడు. అయితే గ‌త జాత‌ర స‌మ‌యంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాత‌ర పూర్త‌య్యే వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్ట‌కూడ‌దంటూ పంచాయితీలో ఊరి పెద్ద‌లు తీర్మానిస్తారు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఈసారి జాత‌ర ఎలా జ‌రిగింది? 12 ఏళ్ల క్రితం కులాల గొడ‌వ వ‌ల్ల విడిపోయిన శివ ఫ్రెండ్స్ గ్యాంగ్ తిరిగి ఎలా ఒక్క‌ట‌య్యింది? ఆ స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

'ఆర్​డీఎక్స్'​ హీరోకు జోడీగా మెగా డాటర్​

న్యూ లైఫ్​ స్టార్ట్​ చేసిన నిహారిక కొణిదెల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.