ETV Bharat / entertainment

నెట్​ఫ్లిక్స్​లో అదరగొట్టిన ఇండియన్ సినిమాలు- టాప్​ మూవీస్​ ఇవే! - Netflix Viewership Report 2023 - NETFLIX VIEWERSHIP REPORT 2023

Netflix Viewership Report 2023: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్​ల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది. మరి నెట్​ఫ్లిక్స్​లో ఎక్కువ మంది చూసిన భారతీయ సినిమా ఏదో తెలుసా?

Netflix Viewership Report 2023
Netflix Viewership Report 2023 (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 3:08 PM IST

Netflix Viewership Report 2023 : తమ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో అత్యధిక వీక్షణలు పొంది సినిమాలు, వెబ్​సిరీస్​ల జాబితాను​ నెట్​ఫ్లిక్స్​ విడుదల చేసింది. 'నెట్​ఫ్లిక్స్ ఎంగేజ్​మెంట్ రిపోర్ట్' పేరిట రిలీజ్​ చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్​ఫ్లిక్స్ చందాదారులు 2023 ద్వితీయార్థంలో దాదాపు 90 బిలియన్ గంటల కంటెంట్​ను వీక్షించారని నివేదికలో పేర్కొంది.

అత్యధిక వ్యూస్​ సాధించిన సినిమా ఇదే!

  1. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో కరీనా కపూర్, విజయ్ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జానే జాన్' చిత్రం నెట్​ఫ్లిక్స్​లో అత్యధిక వ్యూస్(20.2 మిలియన్లు) పొందిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'జవాన్' 16.2 మిలియన్ల వ్యూస్​తో రెండో స్థానంలో నిలిచింది.
  2. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుఫియా 12.1 మిలియన్ల వ్యూస్​తో తర్వాత స్థానంలో నిలిచింది.
  3. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా 'OMG 2' 11.5 మిలియన్ల వ్యూస్ సాధించింది.
  4. తమన్నా, విజయ్ వర్మ, కాజోల్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన 'లస్ట్ స్టోరీస్ 2' 9.2 మిలియన్ల వ్యూస్ ను పొందింది.
  5. డ్రీమ్ గర్ల్2 సినిమా 8.2 మిలియన్ల వ్యూస్​ పొందింది.
  6. 'కర్రీ అండ్ సైనైడ్' అనే డాక్యుమెంటరీ నెట్​ఫ్లిక్స్​లో 8.2 మిలియన్ల వ్యూస్​ను సాధించింది.

నెట్​ఫ్లిక్స్​లో 2023 ద్వితీయార్థంలో అదరగొట్టిన వెబ్ సిరీస్ లు :

  1. కోలీవుడ్ నటుడు మాధవన్, కేకే మీనక్, బాబిల్ ఖాన్. దివ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ది రైల్వే మెన్' వెబ్ సిరీస్ 10.6 వీక్షణలతో టాప్​గా నిలిచింది.
  2. సువీందర్ విక్కీ. బరున్ సోబ్తి ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన కొహరా 6.4 మిలియన్ వ్యూస్ సాధించింది.
  3. రాజ్ కుమార్ రావ్, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలో నటించిన 'గన్ అండ్ గులాబ్స్' 6.4 మిలియన్ల వ్యూస్ పొందింది.
  4. 'కాలా పానీ' (5.8 మిలియన్ వీక్షణలు)

ప్రపంచవ్యాప్తంగా నాన్- ఇంగ్లీష్ షోలు, సినిమాలను నెట్ ఫ్లిక్స్ చందాదారులు బాగా వీక్షించారు. నెట్​ఫ్లిక్స్ మొత్తం వ్యూస్​లో దాదాపు మూడింట ఒక వంతు నాన్ ఇంగ్లీష్ చిత్రాల వ్యూస్ ఉన్నాయి.

  • కొరియన్ (9 శాతం వ్యూస్)
  • స్పానిష్ (7 శాతం వ్యూస్)
  • జపనీస్ (5 శాతం వ్యూస్)

అత్యంత ప్రజాదరణ పొందిన ఆంగ్లేతర చిత్రాలు

  • డియర్ చైల్డ్ (53 మిలియన్ల వ్యూస్)
  • ఫర్గాటెన్ లవ్ (43 మిలియన్ల వ్యూస్)
  • పాక్ట్ ఆఫ్ సైలెన్స్ (21 మిలియన్లు వ్యూస్)
  • మాస్క్ గర్ల్ (21 మిలియన్ల వ్యూస్)
  • యు యు హకుషో (17 మిలియన్ల వ్యూస్)
  • బెర్లిన్ (11 మిలియన్లు వ్యూస్)

నెట్​ఫ్లిక్స్​లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు :

  • లీవ్ ది వరల్డ్ బిహైండ్- 121 మిలియన్ల వ్యూస్
  • లియో (96 మిలియన్లు వ్యూస్)

నెట్​ఫ్లిక్స్​లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ :

  • వన్ పీస్( 72 మిలియన్ల వ్యూస్)

అనసూయ జలకాలాట - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పిక్స్ చూశారా? - Anasuya Vacation Tour Pics

యంగ్ హీరోయిన్​కు 'మెగా' ఛాన్స్‌ - విశ్వంభరలో మరో ముద్దుగుమ్మ ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.