ETV Bharat / entertainment

బాలీవుడ్ హీరోయిన్​కు బాలయ్య టీమ్​ స్పెషల్​ సర్​ప్రైజ్! - urvashi birthday celebrations

NBK 109 Urvashi rautela Birthday Celebrations : NBK 109 సినిమా చేస్తున్న నందమూరి నటసింహం తన సినిమాలోని హీరోయిన్​కు స్పెషల్ సర్​ప్రైజ్ ఇచ్చారు! దానికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 11:58 AM IST

NBK 109 Urvashi Rautela Birthday Celebrations : ప్రస్తుతం టాలీవుడ్​ సీనియర్​ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్​ నాాగార్జున​, విక్టరీ వెంకటేశ్​తో పోలిస్తే ప్రస్తుతానికి నందమూరి నటసింహం బాలకృష్ణనే హ్యాట్రిక్ హిట్స్​తో హైస్పీడ్​లో ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుస బ్లాక్ బస్టర్​ను అందుకున్న ఆయన ఇప్పుడు NBK 109 చిత్రం చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో గ్రాండ్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ బ్యాక్​డ్రాప్​తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్​ను జరుపుకుంటోంది.

తాజాగా మూవీటీమ్​ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఓ స్పెషల్ సర్​ప్రైజ్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్​గా నిర్వహించింది. సెట్స్​లో కేక్ కట్​ చేసి తినిపించుకుంటూ అందరూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఊర్వశి పోస్ట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను జరిపిన చిత్రబృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఈ వీడియోలో దర్శకుడు బాబీ కూడా కనిపించి సందడి చేశారు. ఆయన్ను కేక్ తినమంటే సిగ్గుపడుతూ కొంచెం కొంచెం తింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్​ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఊర్వశి రౌతేలాకు బర్త్​డే విషెస్ తెలుపుతున్నారు.

అయితే ఈ పుట్టినరోజు వేడుకల్లో బాలయ్య బాబు కనపడలేదు. బహుశ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. షూటింగ్స్​కు కాస్త లాంగ్ బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య లేని సన్నివేశాలను బాబీ టీీమ్​ చిత్రీకరిస్తోందని సమాచారం అందింది. ఇకపోతే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌ అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్​ కూడా అభిమానులను ఆకట్టుకుంది.

అదీ సార్​ ఐకాన్ స్టార్ బ్రాండ్​ - వామ్మో బన్నీ ధరించిన స్వెట్ షర్ట్​ ధర అంతా?

మృణాల్ ఠాకూర్​కు సూపర్ ఆఫర్​ - ఆ ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరితో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.