Nayanthara rejected Big Remuneration : సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ అంటే నయనతార తప్పకుండా ముందు వరుసలోనే ఉంటుంది. అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికలలో ఆమె ఒకరు. ఒక్కో సినిమాకు దాని బడ్జెట్ ఆధారంగా రూ.5 నుంచి రూ.10, 15 కోట్ల వరకు తీసుకుంటారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆమె తనకిచ్చే రెమ్యునరేషన్ కన్నా డబుల్ ఆఫర్ చేసినా ఓ హీరో సినిమాకు నో చెప్పిందట. వంద కోట్లు ఇచ్చినా కూడా నటించనని చెప్పిందని కథనాలు కనపడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే. తమిళనాట వ్యాపార దిగ్గజం లెజెండ్ శరవణన్ ఆ మధ్య హీరోగా మారిన సంగతి తెలిసిందే. ది లెజెండ్ పేరుతో ఓ సినిమాను తానే స్వయంగా నిర్మించి హీరోగా నటించారు. అయితే 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో
ఆయనతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా నటించింది. కానీ ఆయన మొదటగా ఊర్వశి రౌతేలాకు బదులుగా నయనతారను అనుకున్నారట. తన సినిమాలో కథానాయిక పాత్ర చేసేందుకు నయనతారను ఒప్పించేందుకు ప్రయత్నాలు కూడా చేశారని తెలిసింది.
కానీ నయనతార మాత్రం తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలో నటించనని చెప్పిందట. అప్పటికీ ఆయన డబుల్ రెమ్యునరేషన్ ఇస్తానని కూడా అన్నారట. కానీ నయన్ మాత్రం నో చెప్పి రూ. 10 కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా చేయనని అన్నట్లు బయట కథనాల్లో రాసి ఉంది. దీంతో ఆయన చేసేదేమిలేక బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాను తీసుకున్నారని తెలిసింది. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తంలో చెల్లించారట. మరి ఇందులో నిజమెంతో తెలీదు బయట ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఎవరీ శరవణన్ ? చెన్నైలో బిగ్ బిజినెస్‌మెన్‌గా పేరొందారు లెజెండ్ శరవణన్. శరవణ స్టోర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్ సెల్వరత్నమ్ కుమారుడే అరుళ్ శరవణన్ ది లెెజెండ్. ఈ శరవణ స్టోర్స్‌లో టెక్స్‌టైల్స్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే చిన్నప్పటి నుంచి నటించాలనే కోరికతో అరుళ్ శరవణన్ ది లెజెండ్ సినిమాను తీశారు.ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్ జాన్ జిగ్రీ దోస్త్ ఆ మెగా హీరో అని మీకు తెలుసా? - సీక్రెట్ రివీల్!
రణ్‌బీర్ - రష్మికను ఫాలో అవుతున్న రకుల్ - జాకీ - గాల్లో హనీమూన్ ప్లాన్!