ETV Bharat / entertainment

ఓటీటీలో దూసుకెళ్తున్న మర్డర్ మిస్టరీ మూవీ - మూడు రోజుల్లోనే రికార్డ్​ వ్యూస్​! - Rautu Ka Raaz Movie OTT - RAUTU KA RAAZ MOVIE OTT

ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్​ అదిరిపోయే రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది. ఓటీటీ ఆడియెన్స్​కు విపరీతంగా నచ్చేసింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

source Getty Images and ANI
Nawazuddin Siddiqui Rautu Ka Raaz Movie OTT (source Getty Images and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 3:58 PM IST

Nawazuddin Siddiqui Rautu Ka Raaz Movie OTT : ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్​కు ఫుల్ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజైన ఓ క్లైమ్​ థ్రిల్లర్​ మూవీ మళ్లీ ఈ విషయాన్ని నిరూపించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? రౌతు కా రాజ్. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఓ మర్డర్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రం జూన్ 28న జీ5 ఓటీటీలో రిలీజైంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల వాచ్ మినట్స్​ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ కూడా అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది.

కథేంటంటే? - రౌతు అంటే ఊరి పేరు. రాజ్ అంటే రహస్యం. 15 ఏళ్లుగా ఎలాంటి క్రైమ్‌లు జ‌ర‌గ‌ని రౌతు కీ బేలి ఊరిలో అనుమానస్పదంగా ఓ మహిళ మృతదేహం కనపడుతుంది. అంధుల పాఠశాలలో మహిళా వార్డెన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం ఆ ఊరిలో సంచ‌ల‌నంగా మారుతుంది. దీంతో పోలీస్​ అధికారులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తారు. అలా ఆ ఊరి పోలీస్ స్టేష‌న్ హెడ్ ఆఫీస‌ర్ దీప‌క్ నేగి (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), ఇన్‌స్పెక్ట‌ర్ దిమ్రి (రాజేష్ కుమార్‌) క‌లిసి ఈ కేసును ఎలా ఛేదించారు?, ఈ దర్యాప్తులో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే సినిమా కథ. ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు ఆనంద్ సూరాపూర్ తెర‌కెక్కించారు.

ఈ సినిమా విజయం సాధించడంపై నవాజుద్దీన్ స్పందించారు. "రౌతు కా రాజ్ క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ సినిమా ఊహించ‌ని ట్విస్టుల‌తో ముందుకు సాగుతూ థ్రిల్ పంచుతుంది. ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌జ‌ల ప్రవర్తన తీరు, వారు మాట్లాడే విధానం మొత్తం రియ‌లిస్టిక్‌గా చూపించాం. థ్రిల్ల‌ర్ మూవీనే అయినప్పటికీ అంత‌ర్లీనంగా వ‌చ్చే కామెడీ ఆడియెన్స్​ను బాగా నవ్విస్తుంది. ఈ చిత్రానికి మంచి స్పందన దక్కడం ఆనందంగా ఉంది." అని పేర్కొన్నారు.

దిశా శరీరంపై మిస్టరీ టాటూ - ఆ హీరో పేరు వచ్చేలా? మీనింగ్ అదేనా! - Disha Patani Latest Tattoo

'కల్కి' కాన్సెప్ట్‌తో తెరకెక్కిన టాప్ 7 మూవీస్ - అన్నీ అక్కడివే! - Kalki 2898 AD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.