ETV Bharat / entertainment

'నొప్పి భరించలేనంతగా ఉంది' - యాక్సిడెంట్​పై నవీన్​ పోలిశెట్టి అప్డేట్​ - Naveen Polishetty Health Update - NAVEEN POLISHETTY HEALTH UPDATE

Naveen Polishetty Accident Health Update: తనకు జరిగిన యాక్సిడెంట్​పై హీరో నవీన్ పోలిశెట్టి హెల్త్ అప్డేట్ ఇచ్చారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Naveen Polishetty Accident
Naveen Polishetty Accident (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 2:30 PM IST

Naveen Polishetty Accident Health Update: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' వంటి చిత్రాలతో టాలీవుడ్​లో మంచి హీరోగా నవీన్ పోలిశెట్టి గుర్తింపు పొందారు. అయితే ఆయనకు అమెరికాలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఆ మధ్య వార్త‌లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చేతికి ఫ్రాక్చర్ అయ్యిందని, దాదాపు రెండు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన‌ట్లు కథనాలు వచ్చాయి. అయితే హీరో నవీన్ పోలిశెట్టి తాజాగా దీనిపై స్పందించారు. తన అఫీషియల్​ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్​ వేదిక‌గా తన హెల్త్​ అప్డేట్ ఇచ్చారు.

నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ- 'నా లైఫ్ అప్‌డేట్‌ను మీతో పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తు నా కుడి చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్​ అయ్యింది. అలాగే నా కాలికి కూడా గాయమైంది. ఇది నాకు క్లిష్టమైన సమయం. ప్ర‌స్తుతం ఈ నొప్పి భ‌రించ‌లేనంత‌గా ఉంది. ఈ గాయం వల్ల వేగంగా నా సినిమాలను షూట్ చేసి మీ ముందుకు తీసుకురాలేను. కోలుకోవడం చాలా నెమ్మదిగా ఉంది. అలాగే ఎంతో కష్టంగా ఉంది. కానీ, నేను పూర్తిగా కోలుకునేలా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. కాబట్టి నేను నా ఎనర్జిటిక్ బెస్ట్ మీకు అందించగలను. మునుపెన్నడూ లేనంత బలంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని బలంగా నిర్ణయించుకున్నాను.

గుడ్ న్యూస్ ఏంటంటే నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల కోసం చాలా ఎక్సైటింగ్​గా వెయిట్ చేస్తున్నాను. డెవలప్‌మెంట్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. నేను రిక‌వ‌రీ అయిన తర్వాత పెండింగ్ ప్రాజెక్ట్​లను మొద‌లుపెడ‌తాను. నాకు సంబంధించిన అప్డేట్​లను నేను చెబితేనే నమ్మండి. ఎప్పటిలాగే మీ ప్రోత్సాహం, ప్రేమ నాపై ఉన్నందుకు ధన్యవాదాలు! ఇది నన్ను మళ్లీ తిరిగి షూటింగ్​లలో పాల్గొనే అంతటి శక్తిని ఇస్తుంది. మీరు కురిపిస్తున్న ఈ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంటర్​టైన్​ చేయడానికి, తెరపై కనిపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీరు ఎల్లుప్పుడు ఇలానే ప్రేమను కురిపిస్తారని ఆశిస్తూ' ఇట్లు మీ జానీజీగార్ అంటూ హీరో నవీన్ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు.

కార్తి 'సర్దార్‌ 2' సెట్‌లో ప్రమాదం - అతడు మృతి

'విడుదలై' ఫస్ట్ లుక్ రిలీజ్​ - షేక్ చేస్తున్న విజయ్​ సేతుపతి విశ్వరూపం - Viduthalai Part 2 Posters

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.