ETV Bharat / entertainment

బెస్ట్​ డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​గా జాతీయ అవార్డు - స్టార్​ హీరోలతో జానీ మాస్టర్​ వేయించిన స్టెప్పులివే! - Jani Master National Award

National Award Best Dance Choreographer Jani Master : నెల్లూరులో మెకానిక్​గా పని చేసిన అతడు ఆ తర్వాత జేసీబీ ఆపరేటర్​గానూ పని చేశాడు. అనంతరం డ్యాన్స్​పై మక్కువతో సైడ్​ డ్యాన్సర్​గా, మెయిన్ డ్యాన్సర్​గా టీవీ, రియాల్టి షోలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తూ, సోషల్ మీడియా షేక్ అయ్యే పాటలకు డ్యాన్స్​ కొరియోగ్రఫీ చేస్తూ బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్​గా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆయనే టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​. ఆయన గురించే ఈ కథనం.

source ETV Bharat
National Award Best Dance Choreographer Jani Master (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 8:58 PM IST

National Award Best Dance Choreographer Jani Master : జానీ మాస్టర్​​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్సర్ నుంచి స్టార్ డ్యాన్స్ మాస్టర్​గా ఎదిగారు. కోలీవుడ్, శాండల్​వుడ్​, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. ఈ అవార్డుల్లో పెద్దగా తెలుగు సినిమాల(కార్తీకేయ 2 మినహా) పేర్లు వినిపించకపోయినా తెలుగు తేజం జానీ మాస్టర్​కు ఉత్తమ కొరియోగ్రాఫర్​గా(తిరుచిట్రంబళం - తమిళం) అవార్డు లభించింది. డ్యాన్సర్​​ సతీశ్​ కృష్ణన్‌ మాస్టర్‌తో కలిసి సంయుక్తంగా ఈ పురస్కారం దక్కింది.

ఈ తిరుచిట్రంబళం సినిమాలో ధనుశ్​​, నిత్యా మేనన్ జంటగా నటించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటిలో మేఘం కరుకతా అనే సాంగ్​కు జానీ మాస్టర్ కోరియోగ్రఫీని అందించారు. ఈ సాంగ్​ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్​ను అందుకుంది.

అయితే టాలీవుడ్​కు చెందిన జానీ మాస్టర్ గత కొద్ది కాలంగా కోలీవుడ్​లోనూ ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దళపతి విజయ్, ధనుశ్​, రజనీ కాంత్ లాంటి అగ్ర హీరోలతో స్టెప్పులేయిస్తున్నారు. బీస్ట్​లో ఆయన కంపోజ్ చేసిన అరబిక్ కుతూ, వారిసులో రంజితమే, జైలర్​లో నువ్వు కావాలయ్యా వంటి సాంగ్స్​ అయితే యూట్యూబ్​లో రికార్డు వ్యూస్ కొల్లగొట్టడంతో పాటు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఆడియెన్స్​ అంతా ఈ సాంగ్స్​కు తెగ రీల్స్ చేశారు. ఇంకా ఆయన ఆర్య, సూర్య, కార్తి, శివ కార్తికేయన్​ వంటి హీరోలు చిందులేసిన పాటలకు కొరియోగ్రఫీ చేశారు.

ఇక తెలుగులోనూ ఈటీవీలో ప్రసారమైన 'ఢీ' డ్యాన్స్‌ రియాల్టీ షోతో కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్​, రామ్ పోతినేని, రవితేజ, రామ్​చరణ్​ వంటి హీరోల పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ద్రోణ సినిమాలో ఏమాయో చేశావే పాటతో కొరియోగ్రఫీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత రంగస్థలం జిగేల్ రాణి, క్రాక్ భూమ్ బద్దల్, ది వారియర్ విజిల్ సాంగ్, మాచెర్ల నియోజకవర్గంలో రారా రెడ్డి, పుష్ప చిత్రంలో శ్రీవల్లి వంటి హిట్​ పాటలకు కొరియోగ్రఫీ చేసి స్టార్​ డ్యాన్సర్​గా ఎదిగారు. ఈ పాటలన్నీ సూపర్ రెస్పాన్స్​ను అందుకున్నాయి. ఆయన కొరియోగ్రఫీ చేసిన కన్నడ చిత్రం విక్రాంత్ రోనాలో రా రా రక్కమ్మ పాట కూడా సూపర్ హిట్​గా నిలిచింది. ప్రస్తుతం ఆయన కొరియోగ్రఫీ అందించిన గేమ్ ఛేంజర్ సాంగ్​ రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ఆయన హీరోగా నటించిన ఓ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్​గా నేషనల్ అవార్డ్ - ఈ బుడ్డోడు నటించిన మూవీ ఏ OTTలో ఉందంటే? - Best Child Artist Sreepath

ఆ డైరెక్టర్ దెబ్బకు సినిమాలే వద్దనుకున్నారు - ఇప్పుడేమో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు - Best Actor Rishab Shetty

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.