Natasha Doshi Marriage : ఫిల్మ్ ఇండస్ట్రీలో బాజాభజంత్రీల మోత గట్టిగా వినిపిస్తోంది. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే మరికొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే గత నెల రోజుల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు దాదాపు ఐదు ఆరు జంటలు పెళ్లి పీటలెక్కాయి. తాజాగా మరో తెలుగు హీరోయిన్ శుభవార్త వినిపించింది.
ఆమెనే ముంబయికి చెందిన నటాషా దోషి. 1993 ముంబయిలో పుట్టిన ఈ భామ చదువు పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్రాలతో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. 2012 నుంచి 2017 వరకు మాంత్రికన్,హైడ్ అండ్ సీక్, కాల్ మీ, కాపుచీనో వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
Natasha Doshi Movies : అనంతరం 2018లో నటసింహం బాలయ్య నటించిన జై సింహా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం సీనియర్ నటుడు శ్రీకాంత్‌తో కలిసి కోతలరాయుడులో హీరోయిన్గా, నందమూరి హీరో కల్యాణ్ రామ్‌తో కలిసి ఎంతమంచి వాడవురా చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత కనపడలేదు.
Natasha Doshi Wedding Pics : ఇక 2020 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నటాషా దోషి గతేడాది జులైలో మనన్ షా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు చెప్పి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 31న కుటుంబ సభ‍్యుల సమక్షంలో నటాషా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం అప్పుడు తెలియలేదు. దాదాపు నెల రోజుల తర్వాత తాను తాజాగా పోస్ట్ చేసిన పెళ్లి ఫొటోల ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ పిక్స్ చూస్తుంటే వివాహ వేడుక గ్రాండ్‌గానే జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు ఈ అందాల భామకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాలంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఆ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం -స్టేజ్ మీద నటి క్లారిటీ!
ఈ స్టార్స్ వెడ్డింగ్స్ చాలా కాస్ట్లీ - వేల కోట్లలోనే పెళ్లి ఖర్చులు