ETV Bharat / entertainment

'ప్రతినిధి2' హిట్ అయినట్లు తెలియదే- పొలిటికల్ ఎంట్రీ అప్పుడే!: నారా రోహిత్ - Sundarakanda Movie Nara Rohit

Nara Rohit On Prathinidhi 2 : నారా రోహిత్‌ హీరోగా వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సుందరకాండ' చిత్రం సెప్టెంబర్​ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని టీజర్‌ విడుదల ఈవెంట్‌ నిర్వహించగా నారా రోహిత్ తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు

Nara Rohit On Prathinidhi 2
Nara Rohit On Prathinidhi 2 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 4:56 PM IST

Nara Rohit On Prathinidhi 2 : నారా రోహిత్‌ హీరోగా వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సుందరకాండ'. సందీప్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ పతాకంపై సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృతి వాఘని కథానాయిక నటిస్తోంది. సెప్టెంబర్‌ 6న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా టీజర్​ విడుదల ఈవెంట్​లో మూవీటీమ్​ పాల్గొని సందడి చేసింది. ఇక నారా రోహిత్ తన సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ, తన పొలిటికల్ చిత్రం 'ప్రతినిధి 2' కీలక వ్యాఖ్యలు చేశారు.

'అందరికీ నచ్చడానికి నేను దేవుడిని కాదు'
మంచి కథతో 'సుందరకాండ' తెరకెక్కిందని నారా రోహిత్ అన్నారు. పెళ్లి కాన్సెప్ట్‌ మీద చాలా కథలు వచ్చాయి, మరి 'సుందరకాండ'లో ప్రత్యేకత ఏంటని ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు రోహిత్ ఈ విధంగా బదులిచ్చారు. 'పెళ్లి కాన్సెప్ట్​​ మీది చాలా కథలు వచ్చినా ఇది వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ కథలో జరిగినట్లు నిజజీవితంలో జరిగితే వాళ్లకు గుండె ఆగిపోతుంది. ఐడియా చెప్పినప్పుడే నాకు నచ్చింది. చాలా ఎంజాయ్‌ చేశాను' అని తెలిపారు. ఆరేళ్లు ఎందుకు విరామం తీసుకున్నారని అడగగా, '2017, 2018లో నేను చేసిన సినిమాలు నాకే నచ్చలేదు. కమర్షియల్‌గా ప్రయత్నిద్దాం అనుకున్నా. అందరికీ నచ్చడానికి నేనేం దేవుడిని కాదు. మాములు వ్యక్తిని అంతే. నటుడి జీవితం మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు' అని అన్నారు.

'ప్రతినిధి 2' హిట్​ అయ్యిందా?
'ప్రతినిధి2' సినిమా ఎన్నికలపై పడిందా? 'ప్రతినిధి 3' తీసే అవకాశం ఉందా అనే నారా రోహిత్​ను విలేకర్లు ప్రశ్నించారు. ' ప్రతినిధి 2కు, ఎన్నికలకు సంబంధం లేదు. ఈ సినిమా ఎన్నికలపై ప్రభావం పడిందా అనేది నాకు తెలియదు. అయినా సినిమా ప్రజలపై ప్రభావం చూపిస్తుందని నేను అనుకోను. ప్రజలకు అన్నీ తెలుసు. ఇక 'ప్రతినిధి 3' సినిమా విషయానికొస్తే 'ప్రతినిధి 2' ఎక్కడ హిట్టయింది. నాక్కూడా తెలియదే. అసలు ఆ సినిమా వచ్చిందో రాదో కూడా తెలియడం లేదు. ఒకవేళ నేను హిట్‌ అని చెప్పినా, ఒకవేళ నేను హిట్‌ అని చెప్పినా, మీరు(విలేకరులు) ఆడలేదని రాస్తారు కదా' అని నవ్వూతూ బదులిచ్చారు.

'సీజన్​ బట్టి సినిమాలు చేస్తా'
లవ్‌ స్టోరీలు చేస్తూ మధ్యలో పొలిటికల్‌ సినిమాలు ఎందుకు ఎంచుకున్నారు? తాను సీజన్​కు అనుగుణంగా కథలను ఎంచుకుంటారని నారా రోహిత్ సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో పొలిటికల్‌ సినిమాలు చేశాని, దాని వెనక ప్రణాళికలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అని అడుగుగా, దాని గురించి ఇప్పుడే చెప్పలేనని, కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుందని అన్నారు.

22 ఏళ్ల తర్వాత ఎంట్రీ
ఇక ఈ చిత్రంలో శ్రీదేవి గురించి నటిస్తోంది. దాదాపు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల మందుకు వస్తోంది. 22 ఏళ్ల తర్వాత హీరోయిన్‌గా నటించడం ఎలా అనిపిస్తుంది అని విలేకర్లు ఆమెను ప్రశ్నించారు. 'చాలా సంతోషంగా ఉంది. కథ గురించి చెప్పగానే కొత్తగాను, ఆసక్తిగానూ అనిపించింది. ఇలాంటి పాత్ర మొదటిసారి చేశాను. షూటింగ్‌ అంతా ప్రశాంతంగా అయిపోయింది' అని సమాధానిమిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.