ETV Bharat / entertainment

'సరిపోదా శనివారం' ఫస్ట్​ డే గరం గరం- ఓపెనింగ్స్​పై భారీ అంచనాలు! - Nani Saripodhaa Sanivaaram - NANI SARIPODHAA SANIVAARAM

Nani Saripodhaa Sanivaaram : హాయ్ నాన్న సినిమా గ్యాప్ తర్వాత మరోసారి మాస్ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయారు నేచురల్ స్టార్ నాని. ప్రమోషన్లతో పెరిగిన హైప్‌కు 'సరిపోదా శనివారం' తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Nani Saripodhaa Sanivaaram
Nani (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 7:16 PM IST

Nani Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' అన్ని విధాలుగా ముస్తాబై ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. నానితో పాటు తమిళ దర్శకుడు కమ్ విలక్షణ నటుడు అయిన ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్​ పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల ఈ సినిమాకు మరింత హైప్ పెరిగిపోయింది.

అయితే బుకింగ్స్‌ను బట్టి ఇప్పటికే భారీ వసూళ్లు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లోనే తొలి రోజు కలెక్షన్లలో హైయ్యస్ట్ వసూలు చేసిన సినిమాగా 'సరిపోదా శనివారం' నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ వసూలు చేయనున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో వసూళ్లను కూడా కలుపుకుంటే సినిమా కోట్ల వర్షం కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

'హాయ్ నాన్న' సినిమా తర్వాత మరోసారి మాస్ రోల్ లో నాని కనిపిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా సినిమాలో మాస్ రోల్ లో కనిపించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్త పరుస్తున్నారు ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య.

గతంలో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో 'అంటే సుందరానికి' సినిమా వచ్చింది. థియేటర్లలో కలెక్షన్ సాధించకపోయినా ఓటీటీలో మంచి టాక్​ తెచ్చిపెట్టిందీ సినిమా. అదే కాంబో తెరకెక్కుతున్న ఈ మూవీ మాత్రం ఫుల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. టీమ్​ చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాకు మరింత హైప్ పెరిగిపోయింది.

"ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే ఏ సెంటర్ అభిమానులను, మిడిల్ క్లాస్ కథలోని ఎమోషన్లు బీ సెంటర్ ప్రేక్షకులను, ఉత్కంఠభరితమైన సీన్లు సీ సెంటర్ ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకముంది. చాలా మంచి కాంబినేషన్‌తో వస్తున్నాం" అంటూ తాజాగా నాని పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో నానితో పాటు, SJ సూర్య, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సాయి కుమార్, హర్ష వర్ధన్, శుభలేఖ సుధాకర్, అదితీ బాలన్, మురళీ శర్మలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ వారమే సరిపోదా శనివారం, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్​ - OTT/థియేటర్​లో రాబోయే చిత్రాలివే! - This Week OTT Theatre Releases

జాన్వీ కపూర్​తో మూవీ సెట్ అయిందా? - నాని సమాధానమిదే - Nani Janhvi kapoor

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.