ETV Bharat / entertainment

బాలయ్య కొత్త సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే? - NBK 109 Movie - NBK 109 MOVIE

NBK 109 Movie : ఎన్నికలు పూర్తవ్వడంతో బాలయ్య మళ్లీ ఎన్​బీకే 109 కోసం రెడీ అవ్వబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే? పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Balakrishna (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 4:58 PM IST

Balakrishna NBK 109 Movie : ఎలక్షన్స్​ అయిపోయాయి. మరో రెండు వారాల తర్వాత ఫలితాలు రానున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష కూటమిలో ఎవరు గెలుస్తారనే విషయమై విశ్లేషణలు, అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎన్నికలతో బిజీగా గడిపిన నందమూరి నటసింహం, హిందూపురం తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తిరిగి సినిమాలపై దృష్టి పెట్టేందుకు రెడీ అయిపోతున్నట్లు తెలిసింది.

బ్యాక్​ టు సినిమా కోసం రెడీ అయ్యారట. ముందుగా ఆయన దర్శకుడు బాబీతో కలిసి చేస్తున్న ఎన్​బీకే 109 కోసం సెట్స్​లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలీదు ప్రస్తుతం ఈ విషయం బయట చక్కర్లు కొడుతోంది. లేదంటే ఫలితాలు వచ్చాకే సెట్​లోకి రావొచ్చు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్డెట్​తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన యాక్షన్ గ్లింప్స్​ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. ఇప్పటి వరకు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. తమన్ పాటలు ఇచ్చేశారని, ఇక వాటిని చిత్రీకరించడమే బాలన్స్ ఉందని చెబుతున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే 2024లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. దసరాకు దేవర రానుండటం వల్ల దీపావళిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

అయితే మరి అంత తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయగలరా లేదా అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. జూన్ మొదటి వారంలోపు ఈ విషయంపై ఒక అంచనాకు వస్తారట. బాలయ్య కూడా నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా డేట్స్​ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఛాయాగ్రహణం : విజయ్‌ కార్తీక్‌, కూర్పు : నిరంజన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ : అవినాష్‌ కొల్లా చూసుకుంటున్నారు.

ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య మాస్​ డైరెక్టర్​ బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ చేస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్​ దాదాపుగా పూర్తయ్యిందట. ఆగస్టులో ఫైనల్ నెరేషన్ ఉండొచ్చని వినికిడి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏకంగా 200 సినిమాలకు నో - హీరో అవ్వాల్సినోడు సీరియల్స్​ చేస్తున్నాడు! - Actor Rejected 200 Films

RRR కథ మొదలైంది ఈమె గాత్రంతోనే- ఫేస్​బుక్​ పోస్ట్​తో రాజమౌళి కంటికి చిక్కిన 15 ఏళ్ల సింగర్! - RRR Singer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.