Nagashwin Prabhas Kalki 2898AD First Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సెన్సార్ పూర్తైంది. అందరూ ఊహించినట్లే యూ/ఏ సర్టిఫికెట్‌ను అందుకుంది. రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాలు. అంటే 175 నిమిషాలు(Kalki 2898 AD Censor Run time). సినిమాలో ఊహించని రేంజ్లో ట్విస్ట్‌లు, సస్పెన్స్‌లు ఉన్నాయట. భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టారట. నాగ్ అశ్విన్ మాత్రమే ఇలాంటి విజన్‌తో సినిమా చేయగలరని అంటున్నారు. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ రివ్యూ బయటకొచ్చినప్పటి నుంచి సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. ఫ్యాన్స్ ఈ రివ్యూను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా కోసం ఐ యామ్ వెయిటింగ్ అంటూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
Kalki Advance Bookings : కాగా, కల్కి సినిమాను పాన్ వరల్డ్ అంటూ మేకర్స్ మొదటి నుంచే బజ్ క్రియేట్ చేశారు. అయినా మొదట సినిమాపై అంతగా హైప్ రాలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్ అయింది. బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్, రిలీజైన ఒక నేనే. నాకు చుట్టూ నేనే సాంగ్ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయి హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ రెండు మిలియన్ల డాలర్లకు పైగా మార్క్‌ను టచ్ చేసిందట. దీంతో ప్రీ సేల్స్ విషయంలో రికార్డులు నమోదవుతున్నాయి.
ఇకపోతే ఈ చిత్రాన్ని సైన్స్‌కు మైథాలజీని జోడించి తెరకెక్కించారు. ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో ఇది సాగుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బోల్డ్ బ్యూటీస్ దిశా పటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.
'కథ రాయడానికి ఐదేళ్లు పట్టింది - కలిపురుషుడిని అలా చూపించాలనుకున్నా' - Kalki 2898 AD Movie