ETV Bharat / entertainment

'కల్కి' యాక్షన్ సీక్వెన్స్ వెనక ఉన్న రియల్ హీరో ఇతడే! - మేకింగ్ వీడియో చూశారా? - Kalki 2898 AD Making Video

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 1:55 PM IST

Kalki 2898 AD Making Video : కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ - అమితాబ్​ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని సినీ ప్రియులు అంటున్నారు. మరి ఈ యాక్షన్ సీక్వెన్స్​ వెనక ఉన్న అసలు హీరో ఎవరో తెలుసా?

source ETV Bharat
kalki 2898 AD Making Video (source ETV Bharat)

Kalki 2898 AD Making Video : ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది. దీంతో ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ వండర్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం ఎపిసోడ్​ అదిరిపోయిందంటూ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ రేంజ్​లో ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు(Kalki 2898 AD Review).

ప్రభాస్ – అమితాబ్​కు మధ్య వచ్చే హై లెవెల్​ యాక్షన్ ఫైట్స్ ప్రేక్షకులను తెగ మెప్పిస్తున్నాయి. మరి ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్​లను డిజైన్ చేసింది ఎవరో తెలుసా? దీని వెనక ఉన్న యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరిదో తెలుసా? ఆయన గురించి తెలుపుతూ మెకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఇంతకీ ఆయనెవరంటే యాండీ లాంగ్ గ్యుఎన్. ఈయన హాంగ్ కాంగ్ మూలాలు ఉన్న జర్మనీకి చెందిన వ్యక్తి. వృత్తి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని స్టంట్ మాస్టర్​గా మారారు. సూపర్ హీరో జాకీచాన్​తో కూడా కలిసి పనిచేశారు.

ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమాలకు కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్​గా పనిచేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్​కు కల్కి చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రం కోసం యాండీ లాంగ్, తన టీమ్ కలిసి అదిరిపోయే యాక్షన్ విజువల్స్​ను సృష్టించారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు రీసెంట్​గానే కల్కి టీమ్​కు, నాగ్ అశ్విన్​కు, నిర్మాతకు సోషల్​ మీడియాలో థ్యాంక్స్ చెబుతూ యాండీ లాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.

ఇప్పుడేమో తాజాగా యూట్యూబ్​లో యాండీ లాంగ్ టీమ్క ల్కి సినిమా కోసం చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఈ వీడియోలో యాక్షన్ సీన్స్ ఎలా తీశారు, అమితాబ్, ప్రభాస్​కు యాక్షన్ ఎలా నేర్పించారు వంటివి చూపించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా సినిమాతో పాటు యాండి లాంగ్​ గురించి మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ కల్కి యాక్షన్ మేకింగ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలో 'కల్కి' ఊచకోత - ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే? - Kalki 2898 AD America Collections

'కల్కి' టికెట్​ దొరకలేదా? - మీకోసమే వీకెండ్​ స్పెషల్​ OTTలో 13 క్రేజీ సినిమాలు రిలీజ్! - THIS WEEK OTT RELEASES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.