ETV Bharat / entertainment

'ఆయన పాటలు మనుషులకు నేస్తాలు - అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్' - Nagarjuna About Sirivennela - NAGARJUNA ABOUT SIRIVENNELA

Nagarjuna About Sirivennela Sitarama Sastry : గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు కింగ్ నాగార్జున. ఇంకా పలు విషయాలను గురించి మాట్లాడారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 3:53 PM IST

Nagarjuna About Sirivennela Sitarama Sastry : కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఆయన కెరీర్​లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో 'నేనున్నానుట కూడా ఒకటి. నాగార్జున, శ్రియ, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆదిత్య తెరకెక్కించారు.

2004లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో క్లాసికల్ హిట్​గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు, సన్నివేశాలను ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. అయితే ఆ సినిమా అంత పెద్ద సకెస్స్ అవ్వడానికి గల కారణాన్ని తెలిపారు హీరో నాగార్జున. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వల్లే విజయం సాధించిందని అన్నారు.

Naa Uchvasanam Kavanam Program : ఈటీవీ 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమానికి గెస్ట్​గా వచ్చిన నాగార్జున తనకు ఇష్టమైన పాటల గురించి చెప్పుకొచ్చారు. అలానే సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. రెండు లైన్లలోనే పాటలోని భావమంతా అర్థమయ్యేలా రాయడం సిరివెన్నెల గొప్పతనమని పేర్కొన్నారు.

"శాస్త్రి గారు రాసిన పాటల్లో నాకు నచ్చినవి చాలా ఉన్నాయి. 'ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా' సాంగ్​ ప్రతీ కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఒక తండ్రి తన కుమారుడికి చెప్పాలనుకున్న మాటలన్నీ ఆ సాంగ్​లో చెప్పేశారు సిరివెన్నెల. నేను ప్రొడ్యూస్ చేసిన 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి'కు ఆయన సాంగ్స్ రాశారు. అప్పుడు ఆయనతో ఎక్కువగా గడిపే అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో అయితే రామాయణం మొత్తాన్ని ఒక్క పాటలోనే చెప్పేశారు. నాకు నచ్చిన పాటల్లో ఇది కూడా ఒకటి. నేనున్నాను సినిమాలో 'ఏ శ్వాసలో చేరితే' పాట అయితే అద్భుతం. మూవీ హిట్‌ కావడానికి ఆ పాటే కారణం. లిరిక్స్‌ మరో స్థాయిలో ఉంటాయి. 'ఊపిరి' చిత్రంలోనూ 'నువ్వేమిచ్చావో' సాంగ్​ సినిమాలోని అర్థాన్ని మొత్తం చెబుతుంది. చిన్న పాటైనా లోతైన భావం ఉంటుంది" అని నాగ్ అన్నారు.

ఆయన పాటలు నేస్తాలు - "మీ చిత్రాల్లో సిరివెన్నెల గారి పాటలు ఎక్కువ ఉంటాయి. ఏమైనా ప్రత్యేక కారణ ఉందా?" అని అడిగిన ప్రశ్నకు నాగ్ సమాధానమిచ్చారు. "అందుకు ప్రత్యేక కారణంటూ ఏమీ లేదు. సిరివెన్నెల గారు నాకు ఇష్టమైన గేయ రచయిత. అందుకే నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో సాంగ్స్ ఆయన రాస్తే బాగుంటుందని అనుకొనేవాడిని. పైగా ఆయనతో నాకు చనువు కూడా ఎక్కువే. ఏదైనా నచ్చకపోతే, అర్థం కాకపోతే మార్చమని అడిగేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పాటలు మనుషులకు నేస్తాలు అని నా అభిప్రాయం. జీవితానికి ఒక దారిని చూపిస్తాయి. ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన సాంగ్స్​ విన్నాక ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదు అని కూడా అనిపిస్తుంటుంది. అలా రాయడం అంత ఈజీ కాదు. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టే ఆయనకి అది సాధ్యమైంది" అని నాగ్ చెప్పుకొచ్చారు.

ఫ్యాన్​కు సారీ చెప్పిన నాగ్​ - దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడి! - Nagarjuna Airport Video

ఇది సార్ ప్రభాస్​ బ్రాండ్​ - ఈ సినిమాల వసూళ్లన్నీ రూ.500 కోట్లుపైనే! - Kalki 2898 AD Collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.