Nagarjuna Naa Saami Ranga World Wide Collections : టాలీవుడ్ మన్మథుడు, సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ' ఈ సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ బాగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రానికి 6 రోజుల్లో రూ.19.43 కోట్ల షేర్ వచ్చింది. అలానే వరల్డ్ వైడ్‌గా రూ. 38.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో 'నా సామిరంగ' 6వ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో – 22 లక్షలు, సీడెడ్ – 24 లక్షలు, వైజాగ్ – 26 లక్షలు, ఈస్ట్ – 18 లక్షలు, వెస్ట్ – 11లక్షలు, కృష్ణ – 9 లక్షలు, గుంటూరు – 11 లక్షలు, నెల్లూరు – 6లక్షలు వచ్చాయని తెలిసింది. మొత్తంగా 6వ రోజు రూ. 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందట. 6 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 19. 43 కోట్ల షేర్ వచ్చిందట. వరల్డ్ వైడ్ రూ. 38.5 కోట్ల గ్రాస్ వచ్చింది.
ఈ సినిమాను విజయ్ తెరకెక్కించారు. మాస్ అండ్ ఫ్యామిలీ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు.
'నా సామిరంగ' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ట్రేడ్ వర్గాల ద్వారా అందిన సమాచారం ఇలా ఉంది. నైజాంలో రూ. 5.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలిసింది. దీంతో పాటు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కూడా కలిపి మొత్తంగా రూ. 18.20 కోట్లు బిజినెస్ అయిందట.
-
Sankranthi KING #NaaSaamiRanga continues the rampage at box office❤️🔥
— BA Raju's Team (@baraju_SuperHit) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
With terrific footfalls in all centres, the film collects massive 38.5 crores gross in 6 days💥😍
Book 🎟
https://t.co/1i8BJmy6kJ#NaaSaamiRangaJaathara 🔥
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani… pic.twitter.com/7Mk9WABIa7
">Sankranthi KING #NaaSaamiRanga continues the rampage at box office❤️🔥
— BA Raju's Team (@baraju_SuperHit) January 20, 2024
With terrific footfalls in all centres, the film collects massive 38.5 crores gross in 6 days💥😍
Book 🎟
https://t.co/1i8BJmy6kJ#NaaSaamiRangaJaathara 🔥
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani… pic.twitter.com/7Mk9WABIa7Sankranthi KING #NaaSaamiRanga continues the rampage at box office❤️🔥
— BA Raju's Team (@baraju_SuperHit) January 20, 2024
With terrific footfalls in all centres, the film collects massive 38.5 crores gross in 6 days💥😍
Book 🎟
https://t.co/1i8BJmy6kJ#NaaSaamiRangaJaathara 🔥
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani… pic.twitter.com/7Mk9WABIa7
విజయ్ దేవరకొండ సరసన 'యానిమల్' భామ!
'గేమ్‌ఛేంజర్' కోసం చరణ్ డేంజరస్ రిస్క్ - 12 గంటలకు పైగా అక్కడే ఉండి!