ETV Bharat / entertainment

ఫ్యాన్​కు సారీ చెప్పిన నాగ్​ - దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడి! - Nagarjuna Airport Video - NAGARJUNA AIRPORT VIDEO

Nagarjuna Airport Video : ఇటీవలే హీరో నాగార్జున ఫ్యాన్​ ఒకరిని ఆయన బాడీగార్డ్స్​ తోసేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాగ్ తాజాగా ఆ అభిమానిని నేరుగా కలిసి సారీ చెప్పారు. దగ్గర తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. ఆ వీడియో మీ కోసం.

Nagarjuna Airport Video
Nagarjuna Airport Video (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 4:17 PM IST

Nagarjuna Airport Video : స్టార్ హీరో నాగార్జునకు సంబంధించిన ఓ వీడియో ఇటీవలే వైరల్ అయిన సంగతి తెలిసిందే. 'కుబేర' మూవీ టీమ్​తో పాటు ఆయన ఎయిర్​పోర్ట్​లో వస్తున్న సమయంలో నాగ్ బాడీగార్డ్స్​ అత్యుత్సాహం చూపించారు. నాగార్జునను కలిసేందుకు ఆయన వద్దకు వచ్చిన ఓ వ్యక్తిని లాగి తోసేశారు. ఈ విషయాన్ని నాగ్​ గమనించకపోగా, వెనకనే వస్తున్న హీరో ధనుశ్, అలాగే మూవీ​ టీమ్ చూసింది.

కానీ నాగ్ అతడ్ని గమనించని విషయం ఓ మీడియా ఛానల్ రికార్డ్ చేసిన వీడియోలో బయటపడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగార్జునను అందరూ ట్రోల్ చేశారు. ఆయన కావాలనే ఇలా చేశారంటూ కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.

ఇక ఇదే విషయమై స్పందించిన నాగ్​, తాను ఆ వ్యక్తి తన వద్దకు రావడాన్ని గమనించలేదని, ఇలా జరిగినందుకు క్షమాపణ కోరుకుంటున్నాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతే కాకుండా ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటానని చెప్పారు. అయితే మరికొద్ది మంది నెటిజన్లు మాత్రం నాగ్​ ఆ వ్యక్తిని నేరుగా కలిసి సారీ చెప్పాలని కోరారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆ విమానాశ్రయానికి వెల్లిన నాగ్ అక్కడున్న ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడారు. దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముచ్చటించారు. అప్పుడు జరిగిన దాంట్లో మీ తప్పేం లేదంటూ సర్ది చెప్పారు. నాగ్ ఇలా తనను పిలిచి మాట్లాడటం పట్ల ఆ వ్యక్తి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట ట్రెండ్ అవ్వగా, అభిమానులు నాగ్ చేసిన పనికి హ్యాట్సాఫ్​ చెప్తున్నారు. మరికొందరేమో అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక నాగార్జున ప్రస్తుతం 'కుబేర' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్​లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ధనుశ్​ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయగా, దానికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్‌తో రానున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు.

అభిమానికి క్షమాపణలు చెప్పిన నాగార్జున - ఇంతకీ ఏం జరిగిందంటే?

చెత్తలో 10 గంటలు మాస్క్ లేకుండా - కుబేర కోసం ధనుశ్ భారీ రిస్క్​! - Kubera Dhanush

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.