Naga Chaitanya Sobhita Dhulipala Wedding : టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి వేదిక గురించి నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతోంది. తొలుత, వీరి వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్గానే ప్లాన్ చేయగా, ఇప్పుడు ఆ వేదికను హైదరాబాద్‌కు షిప్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట వివాహం జరగనుందట. ఈ వేడుక కోసం ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అక్కడ ప్రత్యేకమైన సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వేదికను ప్రత్యేకంగా అలంకరించే పనులు కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయట. ఇక అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందని సమాచారం.
అప్పుడే హింట్
నటి శోభిత ఇంట్లో వారం కిందటే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా శోభిత షేర్ చేసుకున్నారు. 'గోధుమ రాయి పసుపు దంచడం, మొదలైపోయింది' అంటూ అందుకు సంబంధించిన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె స్వయంగా పసుపు దంచుతున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. అనుకున్నట్లు గానే పెళ్లి తేదీ చెప్పేశారు. అటు అక్కినేని వారి ఇంట్లో కూడా త్వరలోనే పెళ్లి పనులు ప్రారంభం కానున్నాయి.
స్పెషల్ అట్రాక్షన్
కాగా, రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ANR జాతీయ అవార్డులు పురస్కారానికి శోభిత దూళిపాళ్ల హాజరయ్యారు. గ్రీన్ శారీ ధరించి క్లాసీ లుక్‌తో కనిపించారు. ఆమె అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి అవార్డ్స్ వేడుకలో సందడి చేశారు. చై, శోభిత జంట ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇదే ఈవెంట్లో అక్కినేని నాగార్జున తనకు కాబోయే కోడలిని మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. ఆమె చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు.
కాగా శోభిత 'గూఢచారి', 'మేడ్ ఇన్ హెవెన్', 'ఘోస్ట్ స్టోరీస్', 'నైట్ మేనేజర్', 'పోన్నియన్ సెల్వన్' వంటి సినిమా/సిరీస్‌లో కీ రోల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలే కాకుండా తాజాగా హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
నాగ చైతన్య - శోభిత పెళ్లి పనులు ప్రారంభం
జంగిల్ సఫారీ టు లండన్ గేట్ వే - శోభితతో చై ప్రేమ చిగురించిందిలా! - Naga Chaitanya Sobhita Love Story