Naga chaitanya Sobhita Dhulipala Marriage : అక్కినేని నాగ చైతన్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయాక ఆయన కొంత కాలం పాటు కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. రీసెంట్గా హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ అండ్ షాక్ ఇచ్చారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయమై తొలిసారి స్పందించారు నాగ చైతన్య.
ఏం అన్నారంటే? - హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి అక్కినేని నాగ చైతన్య గెస్ట్‌గా వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు షోరూమ్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. కారులో హిమాయత్‌నగర్ చౌరస్తా నుంచి షోరూమ్ వరకు నాగ చైతన్యను డప్పు చప్పుళ్లతో ర్యాలీగా తీసుకొచ్చారు. దీంతో చైతూను చూసేందుకు ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలోనే వచ్చారు.
ఈ క్రమంలోనే షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నాగ చైతన్య సమాధానమిచ్చారు. ఇందులో భాగంగానే తన పెళ్లి, తండేల్ సినిమా అప్డేట్స్ గురించి మాట్లాడారు.
'డెస్టినేషన్ లేదా హైదరాబాద్‌లోనే మీ పెళ్లి జరుగుతుందా?' అని ప్రశ్న అడగగా "నాకు పెళ్లి అంటే నా మనసుకు దగ్గరైన వాళ్లందరూ ఉండాలి. అంటే భారీగా చేసుకోవాలని కాదు. కానీ మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడమే నాకిష్టం. అలానే చేసుకుంటాను. అయితే ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. త్వరలోనే అందరికి అన్నీ తెలుస్తాయి" అని చెప్పుకొచ్చారు.
'సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకు?' అని అడగగా "అలా ఏమిలేదు. నన్ను ఎక్కువ చూపిస్తున్నారేమో" అని చెప్పారు.
తండేల్ గురించి మరో ప్రశ్న అడగగా - తన ప్రస్తుత లుక్ తండేల్ కోసం అని చెప్పారు. ఇప్పటి వరకు తను చేసిన చిత్రాలతో పోలిస్తే తండేల్ పాత్ర ఎంతో సవాల్‌తో కూడుకున్నదని చెప్పారు. ఇది నిజమైన కథ ఆధారంగా రూపొందుతోందని పేర్కొన్నారు.
రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేసిన నాగ చైతన్య - గంగూలీతో పోటీ! - Naga Chaitanya Indian Racing League
8.8.8 నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థ ముహూర్తం స్పెషల్ ఏంటో తెలుసా? - Naga Chaitanya Sobhita Dhulipala