Prabhas Kalki 2898 AD Trailer : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. జూన్ 27న రిలీజ్ కానుందీ చిత్రం. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉందీ ప్రచార చిత్రం ట్రైలర్. చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రైలర్ మీరూ చూసేయండి.
ట్రైలర్ సాగిందిలా - ఈ ట్రైలర్ రన్ టైమ్ మొత్తం 3.10 నిమిషాలు. ఇందులో కల్కి ప్రపంచం, మెయిన్ స్టార్ క్యాస్ట్ క్యారెక్టర్లతో పాటు సినిమా కథను పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ కథ కోసం దర్శకుడు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని ట్రైలర్ చూస్తే పక్కాగా అర్థమవుతోంది.
భైరవగా ప్రభాస్ లుక్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, బుజ్జి (స్పెషల్ కార్) ఎలా ఉంటుందో ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్ ఈ రోజు విడుదల చేసిన ప్రచార చిత్రంలో మరింత విసృత్తంగా చూపించారు. ఒక్కో యాక్షన్ సీన్, విజువల్ హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించింది. ప్రభాస్‌తో పాటు మిగతా ప్రధాన తారాగణాన్ని చూపించారు.
'ఈ భూమి మీద మొదటి నగరం', 'ఈ భూమి మీద చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయట.', 'భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి'. 'ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే. దేవుడు ఒక్కడే సుప్రీం', 'ఆరు వేల సంవత్సరాల క్రితం ఉన్న పవర్ ఇప్పుడు వచ్చిందంటే ఇక వెలుగు వచ్టే సమయం అయింది' అంటూ వివిధ పాత్రలు చెప్పిన డైలాగ్స్, వాటికి తగ్గ విజువల్స్ రిచ్‌గా సాగాయి.
అనంతరం కథలోకి తీసుకెళ్లారు దర్శకుడు. అమితాబ్, ప్రభాస్ యాక్షన్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. 'నీలాంటోడు ఎంత మందిని రక్షించగలరో తెలుసా?' అని అడగగా 'నేను రక్షించాల్సింది ఒక్కడినే. నేను కాపాడుతాను' అంటూ అమితాబ్, 'రికార్డ్స్ చూస్కో, ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు' అని ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ విజిల్స్ వేయిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ చివర్లో కమల్ హాసన్ 'భయపడకు మరో ప్రపంచం వస్తుంది' అంటూ వైలెంట్ లుక్‌లో చెప్పిన డైలాగ్ కూడా అదిరిపోయింది.
ప్రభాస్ యాక్షన్‌తోపాటు కామెడీ టైమింగ్ కూడా నవ్వించింది. ఇక సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది.