ETV Bharat / entertainment

'అది తెలిసి ఆశ్చర్యపోయా - వినగానే బ్లడ్​ బాయిల్ అయిపోతది!' : ప్రభాస్‌ - NAA UCHVASAM KAVANAM PRABHAS

ఈటీవీలో ప్రసారమవుతోన్న 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రభాస్​ - సెకండ్ ప్రోమో రిలీజ్.

Naa Uchvasam Kavanam Prabhas
Naa Uchvasam Kavanam Prabhas (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 10:51 AM IST

Naa Uchvasam Kavanam Prabhas : ఈటీవీలో ప్రసారమవుతోన్న 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి పార్ట్‌ 2 ప్రోమో రిలీజ్ అయింది.

ఇందులో డార్లింగ్ ప్రభాస్‌ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు సెకండ్​ ప్రోమోలో 'శివ' సినిమాలో బోటనీ పాఠముంది సాంగ్​ గురించి మాట్లాడారు. ఆ పాటను రచయిత సీతారామశాస్త్రి రాశారని తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పుకొచ్చారు. తాను ఎక్కడకు వెళ్లినా ఆ పాట పాడే వాడినని గుర్తు చేసుకున్నారు. శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు రాసినవి వింటుంటే ఒక రకమైన ఉద్వేగానికి గురవుతామని, బాడీలో బ్లడ్​ బాయిల్​ అవుతుందని ప్రభాస్‌ అన్నారు.

Sirivennela Sitaramasastri Prabhas : పార్ట్​ 1లో సిరివెన్నెల సీతారామశాస్త్రి వల్లే సినీ సాహిత్యంపై తనకు ప్రేమ పుట్టిందని ప్రభాస్‌ అన్నారు. గతంలో తాను నటించిన 'వర్షం' సాంగ్స్​తో అది మొదలైందని తెలిపారు. "నా తొలి సినిమా ఈశ్వర్‌లోని మొదటి పాట (అమీర్‌పేటకు)ను సిరి వెన్నెల రాశారు. అందులోని 'కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా' లైన్‌ నాకు బాగా నచ్చింది. వర్షం సినిమాకు పని చేసే సమయంలో సీతారామశాస్త్రి వల్ల సాహిత్యంపై ప్రేమ కలిగింది. ఆ మూవీ సెట్స్‌లోనే తొలిసారి ఆయన్ను కలిశాను." అని ప్రభాస్​ చెప్పుకొచ్చారు.

Prabhas Upcoming Movies : ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. సలార్​, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన ప్రస్తుతం మారుతీతో రాజాసాబ్​ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనంతరం హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ వంగాతో స్పిరిట్ చిత్రాలను చేయనున్నారు. ఇవ్వి పూర్తవ్వగానే సలార్ 2, కల్కి 2898 ఏడీ 2 చిత్రాలను సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారు. ఇవన్నీ భారీ బడ్జెట్​ చిత్రాలే కావడం విశేషం.

ఇండస్ట్రీలోకి మరో నందమూరి హీరో - హరికృష్ణ మనవడిని పరిచయం చేసిన వై.వి.ఎస్‌. చౌదరి

దీపావళికి బాక్సాఫీస్ సందడంతా ఈ ముద్దుగుమ్మలదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.