Mrunal Thakur Pan India Movie : 'సీతారామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఆ చిత్రం విజయంతో ఆమె ముందు మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. అలా నేచురల్ స్టార్ నాని సరసన 'హాయ్ నాన్న'లో నటించి మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది.
మృణాల్ ఠాకూర్ ఆచితూచి మరీ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. అలా బాలీవుడ్‌లోనూ బానే సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ మృణాల్‌కు అవకాశాలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో హిరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. వింటేజ్ గెటప్‌లో మృణాల్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కారణంతోనే హనురాఘవపూడి మృణాల్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
హనురాఘవపూడి-ప్రభాస్ కాంబినేషల్లో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ పట్టాలపైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల సలార్‌తో దుమ్మురేపిన ప్రభాస్, ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న 'కల్కి-2898ఏడీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. దీంతోపాటు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు. ఇక యానిమల్తో బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగతో 'స్పిరిట్' చేస్తున్నారు.
విజయ్, రష్మిక లవ్ స్టోరీ! ఇద్దరి తలపై ఒకే క్యాప్- ఇప్పుడిదే నెట్టింట ట్రెండింగ్!
వచ్చే ఏడాదే స్టార్ హీరోయిన్‌తో టిల్లుగాడి పెళ్లి!- క్లారిటీ ఇచ్చిన చైతన్య జొన్నలగడ్డ