ETV Bharat / entertainment

ఆ సినిమాపై 34 కేసులు, నటికి వేధింపులు - దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీ ఏదంటే ? - నిఖా మూవీ కాంట్రవర్సీ

Most Controversial Movie In India : కొన్ని సార్లు మేకర్స్ ఒక ఉద్దేశంతో తెరకెక్కించిన మూవీ ఆడియెన్స్​ వద్దకు వచ్చేసరికి అనేక కాంట్రవర్సీలకు కేరాఫ్​ అడ్రెస్​గా మారుతుంటాయి. ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నప్పటికీ 42 ఏళ్ల క్రితం విడుదలైన ఓ మూవీ మాత్రం మోస్ట్ కాంట్రవర్సీయల్ మూవీగా రికార్డుకెక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ?

Most Controversial Movie In India
Most Controversial Movie In India
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 7:20 PM IST

Most Controversial Movie In India : ఇండస్ట్రీలో కొంత మంది డైరెక్టర్లు పరిధిలను దాటి కొన్ని సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అయితే వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిన పలు సినిమాలు రిలీజ్​కు ముందు ఆ తర్వాత అనేక కాంట్రవర్సీలను తెరలేపుతుంటాయి. ఇటీవలి కాలంలో వచ్చిన 'కశ్మీర్ ఫైల్స్​', 'ది కేరళ స్టోరీ' లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అయితే 90స్​లో తెరెకెక్కిన ఓ బాలీవుడ్ మూవీ దేశంలోనే అత్యంత వివాదాస్పద సినిమాగా రికార్డులకెక్కింది. దీనిపై ఏకంగా 34 కోర్టు కేసులు ఉండగా, ఇందులో ఉన్న నటీనటులపై వేధింపులు కూడా జరిగాయట. అయినా ఆ సినిమా బాక్సీఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ మూవీకి ఎందుకంత కాంట్రవర్సీగా మారిందంటే ?

1982లో బీఆర్ చోప్రా 'నిఖా' అనే సినిమాను రూపొందించారు. ఇందులో రాజ్ బబ్బర్, దీపక్ పరాశర్, సల్మా అఘా లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రిపుల్ తలాక్ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ముందుగా ఈ సినిమాకు 'తలాక్ తలాక్ తలాకే' టైటిల్ పెట్టారు. అయితే పలు కారణాల వల్ల మేకర్స్ ఆ తర్వాత ఆ పేరు మార్చారు.

అయితే సినిమా టైటిల్, కథాంశం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ముస్లింలు ఆందోళన చేపట్టారు. అంతేకాదు ఈ సినిమా నిర్మాతలపై 34 కేసులను పెట్టారు. ఇక ఈ మూవీ స్క్రీనింగ్​ కూడా నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరికొందరైతే ఈ సినిమాను చూడవద్దని విజ్ఞప్తి చేస్తూ థియేటర్ల వెలుపల పోస్టర్లు కూడా అంటించారు. హీరోయిన్​ సల్మా అఘాను వేధింపులకు గురిచేశారు.

అయితే తొలుత ఈ సినిమాలో హీరోయిన్​గా ఎంపికయ్యేందుకు అలనాటి నటి అమృతా సింగ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ బీఆర్సీ చోప్రా సల్మా అఘాను తీసుకున్నారు. దీంతో కోపంతో రగిలిపోయిన రుక్సానా, నటి సల్మాను వేధింపులకు గురిచేయడం, బెదిరింపు కాల్స్ చేయడం వంటివి చేశారట. సల్మాను లండన్ తిరిగి వెళ్లిపోవాల్సిందేని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ లేఖల్లో హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని సల్మా భారత్​లోనే ఉండిపోయారు.

ఇంత వివాదాస్పదంగా మారినా కూడా ఈ సినిమా టిక్కెట్ల కోసం జనాలు థియేటర్ల బయట పెద్ద క్యూలో నిల్చున్నారు. అప్పట్లో రూ. 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బడ్జెట్‌ కంటే రెట్టింపు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 9 కోట్లు అందుకుని 1982లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'శ్రీమంతుడు' స్టోరీ కాంట్రవర్సీ - మూవీ టీమ్ రిప్లై - ఏమందంటే?

'అర్థరాత్రి నాపై దాడి చేశారు - ఇది వాళ్ల పనే!'- నటి వనిత విజయ​కుమార్ పోస్ట్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.