ETV Bharat / entertainment

ప్రభాస్ సినిమాలో మెగాస్టార్!- 'స్పిరిట్' కోసం సందీప్ వంగ మాస్టర్ ప్లాన్! - Prabhas Spirit - PRABHAS SPIRIT

Megastar In Prabhas Spirit : ప్రభాస్- సందీప్​రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న 'స్పిరిట్'​లో మెగాస్టార్ నటించనున్నారట!

Megastar in Prabhas
Megastar in Prabhas (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 7:39 AM IST

Megastar In Prabhas Spirit : పాన్ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలున్నాయి. ఆయన వరుస షూటింగ్​ల్లో బిజీగా ఉన్నారు. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'స్పిరిట్' ఒకటి. ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగ పాన్ వరల్డ్ రేంజ్​లో తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్ పవర్​ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు టాక్. దీంతో ఈ కాంబోపై అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నటీనటుల (Cast And Crew) ఎంపికపై దృష్టి పెట్టారట. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ సినిమాలో నటించనున్నారని టాక్ వినిపించింది. ఇక మరో స్టార్ హీరో ఈ సినిమాలో భాగం కానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి (Mammootty) ప్రభాస్ సినిమాలో నటించనున్నారని ఇన్​సైట్ టాక్ వినిపిస్తోంది. ఈ మేజర్ ప్రాజెక్ట్​లో ఆయన భాగం కానున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్​లో మరికొంత మంది ప్రముఖు నటీనటులు కూడా చేరతారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫార్మ్ చేయాల్సి ఉంది. కాగా, ఈ సినిమా టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్​పై రూపొందనుంది. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.

​కాగా, ప్రభాస్ రీసెంట్ బ్లాక్​బస్టర్ కల్కి 'AD 2898'లో కూడా పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నుంచి బిగ్​బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కోలీవుడ స్టార్ కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. దీంతో స్పిరిట్​లో కూడా ప్రముఖులు నటించే ఆవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న రిలీజైంది. లాంగ్​ రన్​లో వరల్డ్​ వైడ్​గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ప్రభాస్​ 'రాజాసాబ్​'కు గుమ్మడికాయ కొట్టేది అప్పుడే! - Rajasaab Shooting Update

'ప్రభాస్ మంచి వ్యక్తి, కానీ సౌత్ ఇండస్ట్రీనే అలాంటిది' - 'రాజాసాబ్​' మాళవిక - Malavika Mohanan On Prabhas

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.