ETV Bharat / entertainment

'మంజుమ్మెల్ బాయ్స్' OTT డీల్స్ కంప్లీట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే? - MANJUMMEL BOYS OTT

Manjummel Boys OTT: రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లను అందుకున్న 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీలో సందడి చేయనుంది. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్​ కానుందంటే?

manjummel boys ott
manjummel boys ott
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 12:52 PM IST

Manjummel Boys OTT: మలయాళ థ్రిల్లర్ 'మంజుమ్మెల్ బాయ్స్' రీసెంట్​గా తెలుగులో రిలీజై బ్లాక్​బస్టర్​ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీమేకర్స్ తెలుగు వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సూపర్ హిట్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ+ హాట్​స్టార్ ఈ విషయం తెలిపింది.

'అతి త్వరలోనే బాయ్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు వచ్చేస్తున్నారు' అని పోస్టు పెడుతూ #ManjummelBoysOnHotstar #ManjummelBoys #DisneyPlusHotstar #ComingSoon' అనే ట్యాగ్‌ జతచేసి సోషల్ మీడియాలో అనౌన్స్​ చేసింది. అతి త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉండనుందని పేర్కొంది.

చిన్న సినిమా రిలీజై ఒక్క మలయాళంలోనే దాదాపు రూ.200+ కోట్లు వసూళ్లు చేసి రికార్డు సాధించింది. ఈ క్రమంలో '2018' సినిమా కలెక్షన్లు దాటేసింది. 2024 అకాడమీ అవార్డులకు సైతం అఫీషియల్‌గా ఈ మూవీ ఎంట్రీ దక్కించుకుంది. ఇంతటి హిట్ మూవీ డిజిటల్ రైట్స్ కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీపడినట్లు తెలిసింది. సినిమాకు సూపర్ రెస్పాన్స్ దక్కడం వల్ల ఓటీటీలు ఆఫర్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని మూవీటీమ్ డిమాండ్ చేసిందట. అన్ని భాషల్లో కలిపి రూ.20 కోట్లు ఫిక్స్ చేసినట్లు టాక్. మరి హాట్​స్టార్ ఈ సినిమాకు ఎంతకు దక్కించుకుందో ఇప్పటికైతే తెలీదు.

ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన 'మంజుమ్మెల్ బాయ్స్‌'ను పర్వా ఫిల్స్ బ్యానర్​పై నిర్మించారు. మంజుమ్మెల్ అనే పట్టణంలో ఓ ఫ్రెండ్స్ గ్రూప్ కొడైకెనాల్ వెళ్లాలని అనుకుంటారు. అలా వెళ్దామనుకున్న స్నేహితుల బృందంలో ఎలాంటి మార్పులు జరిగాయి? చివరకు వాళ్లు వేకేషన్​కు వెళ్లగలిగారా? అనేది చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో సౌబిన్ షహీర్, శ్రీనాథ్ బసీ, బాలు వర్గిసె, గణపతి ఎస్. పొదువల, లాల్ జూర్, దీపక్ పరంబోల్, విష్ణు రెఘూలు ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ఇటీవల మలయాళీ సినిమాలు డబ్బింగ్ పూర్తి చేసుకుని కూడా తెలుగు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన 'ప్రేమలు' కూడా ఇదే విధంగా ఓటీటీలోకి వచ్చి కనువిందు చేసింది. అదే తరహాలో మంజుమ్మెల్ బాయ్స్ కూడా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమై ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధమైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రూ.200 కోట్ల 'మంజుమ్మల్ బాయ్స్'కు బిగ్ షాక్​ - పీవీఆర్​పై మైత్రీ మూవీస్ ఆగ్రహం! - Manjummel Boys

మాలీవుడ్​లో ఫాస్టెస్ట్ రూ. 100 క్రోర్ మార్క్​​! - 'మంజుమ్మెల్ బాయ్స్​' అరుదైన రికార్డు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.