ETV Bharat / entertainment

హీరో రెడీ, మరి సినిమా ఎప్పుడు? - మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోషూట్ వీడియో వైరల్ - Mokshagna Nandamuri - MOKSHAGNA NANDAMURI

Mokshagna Nandamuri Stylish Look Video Viral : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది నందమూరి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

source ETV Bharat
Mokshagna Nandamuri Stylish Look Video (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 1:32 PM IST

Updated : Jul 24, 2024, 1:41 PM IST

Mokshagna Nandamuri Stylish Look Video Viral : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదిగో వస్తున్నాడు, అదుగో వస్తున్నాడు అని సినీ వర్గాలు అంటున్నారే తప్పు దీనిపై స్పష్టత రావట్లేదు. బాలయ్య కూడా పలు సినిమా ఈవెంట్స్​లోనూ తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని చెబుతున్నారే తప్పు అసలు అప్డేట్ ఏమీ ఇవ్వట్లేదు.

అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్​పై హీరో మెటేరియల్ కాదంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ మోక్షజ్ఞ స్లిమ్​గా మారాడు. అప్పడప్పుడు పలు ఈవెంట్లలో కనిపిస్తూ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటున్నాడు. అలా కొద్ది రోజుల క్రితం అయితే మరింత స్టైలిష్​గా దర్శనమిచ్చి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేశాడు. హీరో లుక్స్​తో ఫ్యాన్స్​తో పాటు అందర్నీ ఇంప్రెస్ చేశాడు.

Mokshagna Latest Photos : ఇదే సమయంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అంతా సిద్ధమైపోయిందని గట్టిగానే వినిపించింది. అయితే తాజాగా మోక్షజ్ఞ రీసెంట్​గా దిగిన స్టైలిష్​ లుక్​ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో కలర్​ టీ షర్ట్​లో మోక్షజ్ఞ అదిరిపోయే పోజులు ఇచ్చాడు. ఇప్పుడా ఫోటోషూట్ వైరల్​గా మారింది. దీంతో నందమూరి అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. హీరో రెడీ అయిపోయాడు, మరి సినిమా ఎప్పుడు? అంటూ లైక్స్, కామెంట్లతో సోషల్ మీడియాను హోరత్తిస్తున్నారు.

Mokshagna Movie Director : కాగా, మోక్షజ్ఞ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో లాంఛ్​ అవుతాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని ఆ మధ్య ప్రచారం సాగింది. అంతకుముందు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పేర్లు కూడా వినిపించాయి. ఏదేమైనా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్​ కోరిక త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీతో తీరబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో, మోక్షజ్ఞ ఏ దర్శకుడితో కలిసి ఎంట్రీ ఇస్తారో.

ప్రశాంత్ నీల్​ ఇదంతా నిజమేనా? - Prasanth Neel Ajith Kumar

వామ్మో - సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్​ జీతం నెలకు అన్ని లక్షలా? - Salman Khans bodyguard Salary

Last Updated : Jul 24, 2024, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.