ETV Bharat / entertainment

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ - చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు

Chiranjeevi Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది.

Chiranjeevi Padma Vibhushan
Chiranjeevi Padma Vibhushan
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 11:01 PM IST

Updated : Jan 26, 2024, 6:18 AM IST

Megastar chiranjeevi received Padma Vibhushan : గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను (Padma Awards 2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం ఆయనకు గురువారం (జనవరి 25) పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. కాగా, 2006 కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్​తోపాటు, ఫ్యాన్స్​ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు 1987లో 'స్వయంకృషి', 1992లో 'ఆపద్బాంధవుడు', 2002లో 'ఇంద్'ర సినిమాలకుగాను ఉత్తమ నటుడిగా మెగాస్టార్​ నంది అవార్డులను అందుకున్నారు. అలాగే 'శుభలేఖ' (1982), 'విజేత' (1985), 'ఆపద్బాంధవుడు' (1992), 'ముఠామేస్'త్రి (1993), 'స్నేహం కోసం' (1999), 'ఇంద్'ర (2002), 'శంకర్ దాదా ఎంబీబీఎస్' (2004) సినిమాలకు ఆయన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు.

ఇవే కాకుండా 2006లో 'సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్' పేరిట చిరంజీవికి ఓ స్పెషల్ అవార్డు దక్కింది. ఇది ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా ఆయన అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ తరఫున 'లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' కూడా వచ్చింది. మరోవైపు తెలుగు సినిమా రంగానికి చిరు చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో ప్రతిష్టాత్మక 'రఘుపతి వెంకయ్య అవార్డు' లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

Chiranjeevi Viswambara Movie : ఇక చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్​తో బిజీగా ఉన్నారు. 'బింబిసార' మూవీ ఫేమ్‌ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధం కానుంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు.

Last Updated : Jan 26, 2024, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.