ETV Bharat / entertainment

'సినిమా చూస్తున్నంతసేపు ఆ విషయం మర్చిపోయా'- కమిటీ కుర్రోళ్లు​పై చిరు - Committee Kurrollu - COMMITTEE KURROLLU

Committee Kurrollu Chiranjeevi: చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం అందుకున్న 'కమిటీ కుర్రోళ్లు' మూవీటీమ్​పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

Committee Kurrollu Chiranjeevi
Committee Kurrollu Chiranjeevi (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 5:29 PM IST

Updated : Aug 19, 2024, 5:45 PM IST

Committee Kurrollu Chiranjeevi: మెగా డాటర్ నిహారికా కొనిదెల సమర్పణలో రూపొందిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా ఆగస్టు 9న రిలీజై సూపర్ రెస్పాన్స్​తో థియేటర్లలో దూసుకుపోతోంది. చిన్న సినిమాగా రిలీజైన 'కమిటీ కుర్రోళ్లు' పెద్ద విజయం అందుకొని అందరి ప్రశంసలు పొందుతుంది. ఈ సినిమా సక్సెస్​పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమాలో నటించిన నటులందరూ కథాకు అనుగుణంగా మేకోవర్‌ అవ్వడమే కాకుండా, చక్కగా వారి పాత్రల్లో ఒదిగిపోయారని చిరంజీవి అన్నారు. అలాగే మూవీటీమ్​ను ఇంటికి పిలిచి మరీ అభినందించారు.

''క‌మిటీ కుర్రోళ్ళు' సినిమా చూశా. చిత్రం అద్భుతంగా ఉంది. అంద‌రూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్న‌ప్పుడు కొత్త‌వాళ్లు నటిస్తున్నారనే విష‌యం మ‌ర్చిపోయా. ఎమోష‌న‌ల్ సీన్స్ చాలా చ‌క్క‌గా పండాయి. న‌టీన‌టులంద‌రూ క‌థానుగుణంగా మేకోవ‌ర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచుర‌ల్‌గా చిత్రీకరించ‌టం కోసం మొత్తం టీమ్‌ పడిన కష్టం తెరపై కనిపించింది. బ‌డ్జెట్‌లో సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు య‌దువంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌నలు. డైరెక్టర్​గా త‌ను చ‌క్క‌టి ప్లానింగ్‌తో సినిమాలోని ప్ర‌తీ సీన్​ను ముందుగా డిజైన్ చేసుకోవటం వ‌ల్ల బాగా తీయగలిగారు' అని చిరంజీవి అన్నారు.

ఈ సినిమా సక్సెస్​పై టాలీవుడ్ స్టార్లు ఇప్పటికే స్పందించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్​చరణ్, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, సుకుమార్‌, క్రిష్‌, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్ర‌సాద్ సహా పలువురు సెలబ్రిటీలు సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.

కాగా, ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ య‌దు వంశీ తెరకెక్కించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారికా రూపొందించారు.

Last Updated : Aug 19, 2024, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.