ETV Bharat / entertainment

'బన్నీని పెదనాన్న కొట్టేవారు- అల్లు, కొణిదెల కుటుంబాలకు ఆయనే హెడ్​మాస్టర్' - VARUN TEJ ABOUT MEGA FAMILY

మట్కా మూవీ ప్రమోషన్స్- చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న వరుణ్​

Varun Tej About Mega Family
Varun Tej About Mega Family (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 9:18 AM IST

Varun Tej About Mega Family : మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మీనాక్షితో కలిసి వరుణ్ రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో మెగా ఫ్యామిలీ గురించి, అల్లు అర్జున్, రామ్​చరణ్​తో తనకున్న బాండింగ్ గురించి షేర్ చేసుకున్నారు. అల్లు, కొణిదెల ఫ్యామిలీలకు చిరంజీవి హెడ్​ మాస్టర్ లాంటివారని వరుణ్ అన్నారు. ప్రతి ఆదివారం మీటింగ్ పెట్టి అందర్నీ కలిసేలా చేసేవారని చెప్పుకొచ్చారు. అలాగే చిన్నప్పుడు బన్ని, చరణ్​తో ఉన్న బాండింగ్​ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.

'మేమంకా ఒకే ఇంట్లో పెరిగాం. అందుకే చరణ్​ అన్నతో నాకు కాస్త చనువు ఎక్కువ. నాకు ఏదైనా సమస్య తలెత్తితే ముందు గుర్తొచ్చే వ్యక్తి చరణ్. ఇప్పుడు ఎవరి కెరీర్​లో వాళ్లు బిజీ అయిపోయాం. అందుకే కలవడం కుదరడం లేదు. ఒక్కోసారి ఒకరినొకరం చూసుకోకుండానే నెలలు గడిచిపోతున్నాయి. అయితే మేం ఎక్కడ ఉన్నా, పెదనాన్న సంక్రాంతికి గ్రాండ్​గా నిర్వహించే ఈవెంట్​కు వెళ్తాం. 3-4 రోజులు అక్కడే బాగా ఎంజాజ్ చేస్తాం. మా చిన్నప్పుడు అయితే ఆయన ప్రతి సండే మీటింగ్​ పెట్టేవారు. మేమంతా అక్కడ కలిసేవాళ్లం'

'మేమెంత ఎదిగినా పెదనాన్న మమ్మల్ని ఒకేలా చూస్తారు. మేం కంట్రోల్ తప్పకుండా చూసుకుంటారు. ఆయన ఎం చెప్పినా చేస్తాం. ఆయన అల్లు, కొణిదెల కుటుంబాలకు హెడ్​మాస్టర్ లాంటివారు. చిన్నప్పుడు బన్ని, చరణ్, నాకు ఆయన చేతిలో దెబ్బలు కూడా పడ్డాయి' అని వరుణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఇక మట్కా సినిమా విషయానికొస్తే, 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని దీన్ని తెరకెక్కించారు. నటుడు నవీన్ చంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై విజేంధర్ రెడ్డి, రజని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'మట్కా' టైటిల్​ ఛేంజ్- నాని ట్రెండ్ ఫాలో అవుతున్న వరుణ్!

'బాబాయ్ టైటిల్ వాడినందుకు వణికిపోయా!': వరుణ్​ తేజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.