ETV Bharat / entertainment

21 ఏళ్లకే 75 మూవీలకు సైన్‌ - 100 ఆటోలు, 100 లారీలు కొనాలనే ప్లాన్‌! - ఈ బీటౌన్​ స్టార్ సక్సెస్ జర్నీ ఇదే!

మూవీ రెమ్యూనరేషన్​తో 100 ఆటోలు, 100 లారీలు కొనాలనే ప్లాన్‌! - గోవింద ఎందుకు అలా అనుకున్నారంటే?

Actor Govinda Career
Actor Govinda (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 7:40 AM IST

Actor Govinda Cinema Journey : సుదీర్ఘకాలం వెండితెరను ఏలిన బాలీవుడ్‌ హీరోల్లో గోవింద ఒకరు. 1980స్​లో మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన నటన, ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకొన్నారు. అయితే ఒకప్పుడు ఆయన సినీ జర్నీ ఎలా సాగిందంటే?

21 ఏళ్లకే సూపర్‌ స్టార్‌!
'లవ్ 86' సినిమాతో గోవింద ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. 1986లో 'ఇల్జామ్' అనే మూవీ కూడా రిలీజ్‌ అయింది. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదలై హిట్‌ అయ్యాయి. దీంతో 21 సంవత్సరాలకే గోవింద సూపర్​ స్టార్ అయిపోయారు. వెనువెంటనే 75 సినిమాలకు సంతకాలు చేసి షాక్‌ ఇచ్చారు. అయితే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ సలహా మేరకు, వాటిల్లో 25 ప్రాజెక్టులు వదులుకొన్నారు. అప్పటికే ఆ సినిమాలకు తీసుకొన్న అడ్వాన్సుల విషయంలో గోవింద ఆందోళన చెందినప్పటికీ, దిలీప్ కుమార్ నచ్చజెప్పడం వల్ల ముందడుగు వేశారు.

కెరీర్ ప్రారంభంలో గోవింద విరామం లేకుండా పనిచేశారు. రెండు వారాల పాటు సినిమాల సెట్స్‌లో బిజీగా ఉండి, 16 రోజులపాటు నిద్రపోని సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.

అయితే వరుస సినిమాలు చేస్తున్న గోవిందకు అదే స్థాయిలో సంపద పెరిగిందట. దీని గురించి 2014లో గోవింద సోదరుడు కీర్తి కుమార్ ఓ షోలో చెప్పుకొచ్చారు. "కెరీర్ ప్రారంభంలో గోవింద ఎలా ఖర్చు చేయాలో తెలియనంత డబ్బు సంపాదించారు. ఒకానొక సమయంలో, గోవింద 100 ఆటో రిక్షాలు కొనమని సూచించారు. సినిమాల్లో మరింత ఎదిగాక, 100 ట్రక్కులు కొనాలని కూడా ఆలోచించారు." అని గోవింద చెప్పుకొచ్చారు.

యాక్షన్‌ నుంచి కామెడీకి షిఫ్ట్​
గోవింద మొదట్లో యాక్షన్ సినిమాలతో పాపులర్‌ అయ్యారు. కానీ 1990స్​లో ఆయన యాక్షన్​ నుంచి కామెడీకి షిఫ్ట్​ అయ్యారు. ఆయన కామెడీ టైమింగ్‌కి బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ ఫార్ములాలో వచ్చిన 'ఆంఖేన్', 'రాజా బాబు', 'కూలీ నంబర్ 1', 'హీరో నంబర్ 1', 'దుల్హే రాజా', 'బడే మియాన్ చోటే మియాన్' వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ
ఇటీవల ప్రమాదవశాత్తూ రివాల్వర్‌ పేలడంతో గోవింద పాదంలోకి బుల్లెట్‌ దిగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆ రోల్ చేసేందుకు అందరూ నో- సల్మాన్ మాత్రం ఒక్క రూపాయి రెమ్యునరేషన్​కే! - Salman Khan 1 Rupee Remuneration

బీర్ల బిజినెస్​లో బీటౌన్​ యాక్టర్ దూకుడు- దేశంలోనే బెస్ట్ బ్రాండ్​కు ఓనర్​- ఎవరో తెలుసా? - Bollywood Actor Beer Business

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.